టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరోల్లో విశ్వక్ సేన్ ఒకడు. దర్శకుడిగా కెరీర్‌ను స్టార్ట్ చేసిన ఈ యంగ్ హీరో `వెళ్ళిపోమాకే` సినిమాతో హీరోగా ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు. కానీ, ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలుదు. ఆ తర్వాత `ఈ నగరానికి ఏమైంది` మూవీలో గుర్తింపు తెచ్చుకున్న విశ్వక్ ఫలక్‌నుమాదాస్, హిట్ వంటి చిత్రాలతో సక్సెస్ ట్రాక్ ఎక్కాడు.
ఇక ఈయన నటించిన తాజా చిత్రం `పాగల్` అగష్టు 14న విడుదలైన సంగతి తెలిసిందే. మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ చిత్రం మొదటి రోజు బాగానే కలెక్షన్స్ రాబట్టినా.. ఆ తర్వాత డల్ అయిపోయింది. అయితే ఈ సినిమా ప్రిరిలీజ్ వేడుకలో విశ్వక్ సేన్..పాగల్‌తో హిట్ కొడతానని, అలా జరగకపోతే పేరు మార్చుకుంటానని ఓపెన్‌గానే ఛాలెంజ్ చేశాడు.
ఈ నేపథ్యంలోనే విశ్వక్ సేన్ అసలు పేరేంటి..? ఈయన ఎక్కడ నుంచి వచ్చాడు..? అన్న విషయాలు నెటిజన్లు సెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. అయితే ఈ యంగ్ హీరో రియల్ నేమ్ దినేష్ నాయుడు. కానీ, ఆ పేరు బాగోక పోవడంతో సినిమా కోసం విశ్వక్ సేన్ అని మార్చుకున్నాడు. ఈ పేరు బాగానే కలిసొచ్చింది కూడా. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న విశ్వక్ పుట్టి పెరిగింది హైదరాబాద్‌లోనే.