పుష్ప ఫైట్ సీన్ లీక్ చేసిన పవన్ కళ్యాణ్ అభిమాని..!

స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ నటిస్తున్న ప్రస్తుత చిత్రం పుష్ప. ఈ చిత్రం ప్రేక్షకులను ఎంతగానో అలరించేందుకు త్వరలో మన ముందుకు రాబోతోంది. ఇక అంతే కాకుండా ఈ సినిమాలో ఎంతో మంది కథానాయికలు నటిస్తుండడం గమనార్హం. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా కొత్త గెటప్ లో కనిపించనున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఒక వీడియో క్లిప్ విడుదలైంది.. వాటి గురించి తెలుసుకుందాం.

రష్మిక హీరోయిన్ గా సుకుమార్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న పుష్ప షూటింగ్ నుంచి, కొన్ని వీడియోలు, ఫోటోలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా విడుదల అవుతున్నాయి. ఇక అంతే కాకుండా మహేష్ బాబు సర్కార్ వారి పాట సినిమా నుంచి కూడా కొన్ని క్లిప్స్, వీడియోలు బయటికి రావడం చేత వీటిని నిర్మిస్తున్న నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించినట్లు తెలుస్తోంది.

ఇక ఈ వీడియోలో అల్లు అర్జున్ తన మాస్ యాంగిల్ లో ఫైట్ చేస్తున్నటువంటి వీడియో విడుదలైంది. ఇందులో ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే , ఈ వీడియో ని పవన్ కళ్యాణ్ వీరాభిమానిని విడుదల చేయడం ఆలోచించదగ్గ విషయంగా మారింది. అయితే మరికొంతమంది ఈ వీడియోను అందులోనే పనిచేసే వాళ్లు కొంతమంది విడుదల చేసినట్లు తెలుస్తోంది.

ఇక ప్రస్తుతానికి ఈ సినిమా లో అనసూయ మొన్న ఒక ఓల్డ్ గెటప్ లో కనిపించిన ఫోటో కూడా పైరసీ ద్వారానే విడుదలైంది. దీంతో ఈ సినిమా నిర్మాతలు బెంబేలెత్తుతున్నారు. అయితే ఇలాంటివి కామనే అని మరికొంత మంది ప్రేక్షకులు అంటున్నారు. ఇకపోతే సినిమా విడుదల అవ్వక ముందే ఇలాంటి పోస్టర్లు, వీడియోలు లీక్ అవ్వడం వల్ల సినిమాకు భారీగా నష్టం వాటిల్లుతుందని నిర్మాతలు భయపడుతున్నారు. అయితే ఏది ఏమైనా ఈ విడుదలైన క్లిప్ ను మీరు ఒకసారి చూసేయండి.https://twitter.com/pawankalyan_09/status/1426960574030647298?s=20