పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి కలిసి నటిస్తున్న తాజా మల్టీస్టారర్ చిత్రం `భీమ్లా నాయక్`. మలయాళంలో హిట్ అయిన అయ్యప్పనుమ్ కోశియుమ్‌కు రీమేక్‌గా ఈ మూవీ తెరకెక్కుతోంది. సాగర్ కె.చంద్ర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. నిత్యమేనన్, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
అయితే నిన్న స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ గ్లింప్స్ పవన్ అభిమానులనే కాకుండా అందరినీ తెగ ఆకట్టుకుంది. ఇక యూట్యూబ్‌లో విడుదలైన క్షణం నుండీ భీమ్లా నాయక్ బీభత్సం సృష్టించేస్తున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇప్పటిదాకా వచ్చిన తెలుగు సినిమాల టీజర్లలో ఫాస్టెస్ట్ రికార్డులన్నింటినీ భీమ్లా నాయక్ బద్దలు కొట్టుకుంటూ వెళ్తున్నాడు.
అవును, 24 గంటలు గడవక ముందే ఈ గ్లింప్స్ ఏకంగా 8 మిలియన్ వ్యూస్ మార్కును దాటేసింది. దాంతో అతి తక్కువ సమయంలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న గ్లింప్స్‌గా రికార్డు సృష్టించింది. అలాగే మరోవైపు ఏడు లక్షలకు పైగా లక్స్ ను సాధించిన ఈ భీమ్లా నాయకు.. ముందు ముందు ఇంకెన్ని రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి. కాగా, ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న విడుదల కాబోతోంది.