నెంబర్ వన్ స్థానం లో దూసుకుపోతున్న వంటలక్క.. !

స్టార్ మా లో ప్రసారం అవుతున్న కార్తీకదీపం సీరియల్ లో వంటలక్క అభిమానులను ఎంతగానో సంపాదించుకుంది. ఇక ఈ మధ్య సినిమాలలో కూడా అడుగుపెట్టింది. అయితే ఈ మధ్య కాలంలో తిరిగి మళ్ళీ ముందుకి నెంబర్ వన్ స్థానం లోకి వస్తుందట..వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్. అయితే ఇప్పుడు ఆమె ఎందులో నెంబర్ వన్ స్థానం లో ఉందో తెలుసుకుందాం.

కార్తీకదీపం సీరియల్ ద్వారా మా టీవీ ఛానల్ లో మొదటి నుంచి టిఆర్పి రేటింగ్ లో దూసుకుపోతోంది
గత కొద్ది రోజుల నుండి సీరియల్ బాగా సస్పెన్షన్లతో ప్రసారమవుతున్నది. ఇక ఇదిలా ఉంటే మరో సారి టిఆర్పి రేటింగ్ లో కార్తీకదీపం సీరియల్ మొదటి స్థానం కావడం గమనార్హం.

ఇక పోయిన వారం కంటే ఇప్పుడు ఎక్కువగా 17.8 పర్సంటేజ్ ఎక్కువ శాతం పై, ఈ సీరియల్ ముందడుగులో ఉంది. ఇక ఎప్పటిలాగే గృహ లక్ష్మి, దేవత వంటి పలు సీరియల్స్ లో తక్కువ రేటింగ్ తోనే కొనసాగుతున్నాయి. ఇక జీ తెలుగులో ప్రసారం అవుతున్న త్రినయని సీరియల్..8.6 లో ఉంది, ఇక ప్రేమ ఎంత మధురం సీరియల్..7.91 రేటింగ్ తో ఉంది. ఇక అలాగే రాధమ్మ కూతురు, నెంబర్ వన్ కోడలు సీరియల్ మాత్రం అలాగే ఉన్నాయి.

ఇక ఈ టీవీలో ప్రసారమయ్యేటువంటి మనసు మమత 5.32 ,నా పేరు మీనాక్షి 5.63 శాతం గా నిలిచాయి. ఇక జెమిని ఛానల్ వంటి పెద్ద సంస్థల ఛానల్ లో ప్రసారమయ్యేటువంటి నాటికలు మాత్రం ప్రేక్షకులు మెప్పించలేకపోయాయి. ఇక మొత్తం అంతా చూసుకుంటే ,మా టీవీలో ప్రసారమయ్యే కార్తీకదీపం నాటిక కి మొదటి స్థానం ఇస్తున్నారు ప్రేక్షకులు.