గ్లామర్ షో తప్పుకాదన్నది కొందరి హీరోయిన్ల మాట. వాటిని సమర్థించుకోవడానికి వారి వద్ద సవాలక్ష సమాధానాలుంటాయి. రాశీ ఖన్నా కూడా ఓ కొత్త ఫార్ములా సెలవిస్తోంది. తాము అందంగా కనిపించేది హీరోల కోసమే అంటోంది. ఎందుకంటే కథానాయకులు ఏం చేసినా చూస్తారు. ఎలాగున్నా స్వీకరిస్తారు.
వాళ్ల పేరుకి, వాళ్ల ఇమేజ్‌కీ అంత శక్తి ఉంది. కానీ కథానాయికలకు ఆ సౌలభ్యం ఉండదట. తెరపై కథానాయకుల పక్కన హీరోయిన్లు కనిపించాలంటే… కచ్చితంగా గ్లామర్‌గా ఒలకబోయాల్సిందే అని చెప్తోంది. లేకుంటే కథానాయికలను గుర్తించేది ఎవరంటూ ప్రశ్నిస్తోంది. టాపిక్‌ను గ్లామర్ నుంచి యాక్టింగ్ వైపు మళ్లిస్తూ.. తనకు ఇప్పటి వరకూ వచ్చిన పేరు తన గ్లామర్ వల్ల కాదని చెప్పింది.
తానేం అంత గొప్ప అందగత్తెను కాదని.. తనకంటూ కొద్దో గొప్పో పేరొచ్చిందంటే అది ఆమె నటన వల్లే అని వెల్లడించింది. సినిమా సినిమాకీ గ్లామర్ విషయంలో ఎన్ని మార్కులు పడుతున్నాయో తెలీదుగానీ, నటిగా మాత్రం ఆ పరిణతి సాధిస్తున్నానని చెప్తోంది రాశీ ఖన్నా. ప్రస్తుతం ‘హైపర్’, ‘ఆక్సిజన్’ల్లో నటిస్తోంది ఈ సుందరి.