వార‌ణాసి.. రాజమౌళి పై నెటిజన్స్ ఆగ్ర‌హం.. రీజ‌న్ ఇదే..!

రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో రూపొందుతున్న మోస్ట్ ఎవైటెడ్ ప్రాజెక్ట్‌ వార‌ణిసి. హైదరాబాద్ రామోజీ ఫిలింసిటీ వేదికగా గ్రాండ్ లెవెల్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. ఇక.. ఈ ఈవెంట్‌లో వారణాసి టైటిల్ రివీల్‌ చేస్తూ.. మహేష్ బాబు ఫస్ట్ లుక్, గ్లింప్స్ వీడియోను సైతం వదిలారు. వంద అడుగుల భారీ స్క్రీన్‌పై ఇది ప్లే చేశారు. అయితే.. ఈ గ్లింప్స్‌ ప్లే చేసే టైంలో.. టెక్నికల్ ప్రాబ్లంతో వీడియో అరగంటసేపు డిలే అయింది. దీంతో.. అరగంట తర్వాత మళ్లీ వీడియో ప్లే చేశారు. ఈ క్రమంలోనే.. రాజమౌళి స్టేజ్ పై హనుమాన్ గురించి మాట్లాడుతూ చేసిన కామెంట్స్ వైరల్ గా మారుతున్నాయి.

SS Rajamouli Unveils 'Varanasi' Title at Epic Motion-Poster Launch  Featuring Mahesh Babu | - The Times of India

మూవీలో మహేష్ విశ్వరూపం చూస్తామని.. రాజమౌళిని హనుమాన్ దగ్గరని నడిపిస్తున్నాడని ఆయన తండ్రి.. కథ‌ రచియిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నారు. సిజీ, డబ్బింగ్, రీల్‌ రికార్డ్ అవేంవి లేకపోయినా.. మహేష్ నటన నన్ను మంత్రముగ్ధుడిన్ని చేసేసిందని.. కొన్ని సినిమాలు మనుషులు తెరకెక్కిస్తే.. కొన్ని దైవ నిర్ణయంతోనే జరుగుతుంటాయని వివరించాడు. రాజమౌళి గుండెపై హనుమాన్ ఉన్నారని.. ఏం చేయాలో కర్తవ్య బోధ చేస్తూ.. త‌న వినకుండి నడిపిస్తున్నాడని.. ఆయన వల్లే మాకు ఈ ప్రాజెక్టులు వచ్చాయని.. రాముడు వారధి కట్టడానికి ఉడత భక్తిగా కొందరు రాళ్లు ఎలా అందించారో.. అలా మాకు ఈ అదృష్టం కలిసి వచ్చిందంటూ చెప్పుకొచ్చాడు.

Varanasi event: SS Rajamoulis draws criticism for his remarks on 'not  believing in god'

తర్వాత.. వారణాసి టైటిల్ గ్లింప్స్‌ ప్లే చేసి.. కొంతసేపటికి టెక్నికల్ ఎర్ర‌ర్ వల్ల ఆలస్యం కావడంపై రాజమౌళి మాట్లాడుతూ హాట్ కామెంట్స్ చేశాడు. నాకు దేవుడు అంటే పెద్దగా నమ్మకం లేదు.. హనుమాన్ నా వెన‌కుండి నడిపిస్తున్నాడని నాన్న అన్నారు. ఇలా అంటే నాకు కోపం వచ్చింది. ఇదేనా నడిపించేది అంటూ మండిపడ్డాడు. ఈ క్రమంలోనే.. రాజమౌళి చేసిన కామెంట్స్ పై నెటిజన్స్‌ మండిపడుతున్నారు. చిన్న సమస్య వల్ల వీడియో ప్లే ఆగిపోయింది. దానికి దేవుని తప్పుపట్టడం ఏంటి అంటూ ఫైర్ అవుతున్నారు. ఇలాంటి టెక్నికల్ క్లిచ్స్ అప్పుడ‌ప్పుడు వస్తూ ఉంటాయి. మీ సినిమా దానివల్ల కాస్త కూడా తగ్గదు. కానీ.. మీరన్న మాటలు మాత్రం మిగిలిపోతాయి అంటూ.. త‌మ‌ అభిప్రాయాల‌ వ్యక్తం చేస్తున్నారు.