టాలీవుడ్ సూపర్ స్టార్ రాజమౌళి, మహేష్ బాబు కాంబోలో SSMB 29 రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఇక పాన్ వరల్డ్ మార్కెట్ టార్గెట్ చేస్తూ ఈ సినిమాను రూపొందిస్తున్నాడు జక్కన్న. ఇక సినిమా సక్సెస్ అయితే తెలుగు సినిమాకి గర్వకారణం గా నిలుస్తుంది. దీంతో.. సినిమాను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జక్కన్న.. ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా మన టాలీవుడ్ స్టార్ హీరోలను సైతం ప్రమోషన్స్ కోసం వాడు కొన్ని సినిమాను మరింత హైలెట్ చేయాలని ఆలోచనలో ఉన్నాడట. ఇందులో భాగంగానే తాజాగా స్పెషల్ వీడియోని సైతం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. నవంబర్ 15న జరగబోయే ఈవెంట్ ను ఉద్దేశించి ఆ వీడియోను రిలీజ్ చేశారు.

ఇందులో పవన్ కళ్యాణ్, ఎన్టీఆర్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ప్రభాస్ సినిమాలకు వాళ్ళ అభిమానులు చేసిన హంగామాకి సంబంధించిన క్లిప్స్ వాడడు. ఈ క్రమంలోనే.. మహేష్ సినిమాకు ఇతర హీరోల వీడియోస్ క్లిప్స్ ని ఉపయోగించాల్సిన అవసరమేంటి.. మహేష్ కంటూ ఒక సూపర్, క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇతర హీరోల ప్రస్తావన అవసరమా అంటూ ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు. కానీ.. దీని వెనుక అసలు మ్యాటర్ ఇంకోటి ఉందట. నవంబర్ 15న రామోజీ ఫిలిం సిటీలో జరగబోయే ఈ ఈవెంట్.. కేవలం మహేష్ ఫ్యాన్స్‌కే కాదు.. ఇతర హీరోల ఫ్యాన్స్‌కు కూడా.. బిగ్ సర్ప్రైజ్ గా మారబోతుందని తెలుస్తోంది. ఈ ఈవెంట్ కోసం.. మన టాలీవుడ్ స్టార్స్ అంత సందడి చేయనున్నారట.
అందరికీ రాజమౌళి స్పెషల్ ఇన్విటేషన్స్ అందించినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ విషయం మీడియాకు లీక్ అవ్వకూడదనే ఉద్దేశంతో.. చాలా జాగ్రత్తలు తీసుకున్నాడట జక్కన్న. కానీ.. ఈవెంట్ తేదీ దగ్గర పడుతున్న క్రమంలో.. న్యూస్ లీక్ అయిపోయింది. స్టార్ హీరోలంతా వచ్చినా, రాకపోయినా జక్కన్నతో కలిసి ఇప్పటివరకు పనిచేసిన తారక్, ప్రభాస్, రానా, చరణ్ వచ్చిన చాలు ఈవెంట్ కు హైప్ డబల్ అయిపోతుంది. ఇక పవన్, అల్లు అర్జున్ లకు కూడా ఆహ్వానం పంపాడట జక్కన్న. గతంలో అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్స్ లో జక్కన్న సందడి చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ఈవెంట్ కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. పవన్ మాత్రం ఈవెంట్ కు హాజరవుతాడా.. లేదా.. అనే క్లారిటీ రావాల్సి ఉంది. ఒకవేళ పవన్ కూడా మహేష్ కోసం ఈవెంట్ కు వచ్చి.. ఒకే స్టేజిపై ఈ ఇద్దరు హీరోలు కనిపిస్తే మాత్రం ఆడిటోరియం దద్దరిల్లి పోతుంది అనడంలో సందేహం లేదు.


