టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ సినిమా.. ఫుల్ లెంగ్త్ కామెడీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నయనతార హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక చిరు టైమింగ్‌కు అనిల్ రావిపూడి రైటింగ్, వెంకటేష్ క్రేజ్ తోడైతే.. స్క్రీన్ పై ఏ రేంజ్‌లో మ్యాజిక్ క్రియేట్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ క్రమంలోనే.. ఫ్యాన్స్ సైతం థియేటర్లలో నువ్వులు పోయడం కాయమని.. బొమ్మ బ్లాక్ బాస్టర్ అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
ఇక.. అనిల్ విషయానికి వస్తే తెలుగు సినిమా రేంజ్ అంతకంతకు పెరుగుతున్న క్రమంలో.. స్టార్ హీరోలతో తీసే సినిమాలకు టైం స్పేస్ కూడా పెరుగుతూ వస్తుంది. ఏళ్లకు ఏళ్ళు.. సినిమాలు సెట్స్ పై నడుస్తూ వస్తున్నాయి. కానీ.. అనిల్ మాత్రం డైరెక్ట్ చేసే సినిమా ఏదైనా.. హీరో ఎవరైనా.. తను అనుకున్నట్లుగా వీలైనంత వేగంగా సినిమాను కంప్లీట్ చేసి.. పర్ఫెక్ట్ అవుట్ ఫుట్ తీసుకొస్తున్నాడు. సినిమాను సెట్స్‌పైకి తీసుకెళ్లడమే ఆలస్యం.. ఎంతో వేగంగా సినిమాలను కంప్లీట్ చేస్తున్నాడు. ఇందులో భాగంగానే.. ప్రస్తుతం మన సంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ కూడా చాలా వేగంగా జరుగుతుంది. ఉగాది పూజ కార్యక్రమాలతో.. సినిమా ప్రారంభించిన టీం సరవేగంగా షూట్‌ను కంప్లీట్ చేస్తున్న సంగతి తెలిసిందే.
అందులో భాగంగానే.. ఇప్పటికే మూవీకి సంబంధించిన షూటింగ్ మొత్తం దాదాపు పూర్తయిపోయిందని.. ఒక క్రేజీ టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఈ సినిమాలో మరో రెండు సాంగులు, రెండు ఫైట్ సీక్వెన్స్ మినహా మొత్తం షూట్ కంప్లీట్ అయిపోయిందట. ఈ రెండు పాటలు కూడా చిరంజీవి, వెంకటేష్ పై తెరకెక్కనున్నాయని అంటున్నారు. అంతేకాదు.. అనిల్ ప్లాన్ ప్రకారం మిగతా షూట్ ను కూడా వీలైనంత త్వరగా కంప్లీట్ చేసి ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ పెట్టడానికి సిద్ధమవుతున్నాడట. ఈ క్రమంలోనే.. అనిల్ స్పీడ్ చూసి ఇండస్ట్రీ వర్గాల నుంచి సాధారణ ఆడియన్స్ వరకు అంత ఆశ్చర్యపోతున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు రానున్న ఈ సినిమాపై.. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.. ఇక అనిల్ సినిమా ప్రమోషన్స్ ప్రారంభించి మూవీపై ఏ రేంజ్ లో హైప్‌ను పెంచుతాడు.. ఎలాంటి రిజల్ట్ అందుకుంటాడు చూడాలి.



