NBK 111: బాలయ్య కోసం కోరీర్‌లో ఫ‌స్ట్ టైం నయనతార అలాంటి రిస్క్..

గాడ్ ఆఫ్ మాసేస్ బాలకృష్ణ.. ప్రస్తుతం బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో అఖండ 2 సినిమా పనుల్లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. డిసెంబర్ 5న పాన్‌ ఇండియా లెవెల్‌లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు. అంతేకాదు.. ఇప్పటివరకు ఎన్నడూ లేని 3D వర్షన్‌ను ఈ సినిమా కోసం మేకర్స్‌ ఉపయోగిస్తున్నారు. అఖండ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ సీక్వెల్‌గా రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఆడియన్స్‌లో పీక్స్ లెవెల్ అంచనాలు నెలకొన్నాయి. కాగా.. ఈ సినిమా పనులన్నీ కంప్లీట్ అయిన వెంటనే.. బాలకృష్ణ.. గోపీచంద్ మలినేని సినిమా సెట్స్‌పైకి అడుగుపెట్టనున్నాడు.

ఇక ఇప్పటికే వీళ్ల కాంబోపై ఆఫీషియల్ ప్రకటన వచ్చేసిన సంగతి తెలిసిందే. అంతే కాదు.. సినిమాలో నయనతార హీరోయిన్గా మెర‌వ‌నుందని కూడా క్లారిటీ ఇచ్చేశారు. ఇక.. ఇప్పటికే బాలయ్య, గోపీచంద్ కాంబోలో వీర సింహారెడ్డి లాంటి సినిమా వ‌చ్చి హిట్ కొట్టింది. అంతేకాదు.. నయనతార, బాలయ్య కాంబోలో ఇప్ప‌టివరకు నాలుగు సినిమాలు వ‌చ్చి అన్ని సినిమాలు మంచి సక్సెస్ అందుకున్నాయి. ఈ క్రమంలోనే.. వీళ్ళ ముగ్గురి కాంబో మూవీపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే.. ఇలాంటి క్రమంలోనే బాలయ్య సినిమా కోసం నయనతార మొదటిసారి ఓ రిస్క్ చేయబోతుందంటూ టాక్ వైరల్ గా మారుతుంది.

Nayanthara comes on board Nandamuri Balakrishna's film, starts shooting |  Nayanthara comes on board Nandamuri Balakrishna's film, starts shooting

అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ సినిమాలో నయనతార మునుపెన్నడు లేని రేంజ్‌లో పవర్ఫుల్ ఉమెన్‌గా.. ఓ రాజ్యానికి మహారాణిగా కనిపించ‌నుందని తెలుస్తుంది. ఇప్పటివరకు నయనతార ఎన్నో సినిమాల్లో హీరోయిన్ల మెరిసింది. అంతేకాదు.. లేడి ఓరియంటెడ్‌ సినిమాలతో ఆకట్టుకుంది. కానీ.. మహారాణిలా మారి యాక్షన్ సీన్స్ లో మాత్రం కనిపించలేదు. ఇక.. ఈ సినిమాతో అమ్మడు యాక్షన్ కోణాన్ని కూడా గోపీచంద్ చూపించనున్నాడని తెలుస్తుంది. ఈ క్రమంలోనే నయన్‌ను గోపీచంద్ ఈ సినిమాలో ఏ రేంజ్ లో చూపించబోతున్నాడు అనే ఆసక్తి అభిమానులలో మొదలైంది.