నందమూరి బాలకృష్ణ, బోయపాటి కాంబోలో రినున్న మోస్ట్ అవైటెడ్ మూవీ అఖండ 2. అఖండ లాంటి బ్లాక్ బస్టర్ సీక్వెల్ కివడం.. బోయపాటి – బాలయ్య హ్యాట్రిక్ కాంబోలో ఈ మూవీ రూపొందుతున్న క్రమంలో.. సినిమా సెట్స్ పైకి రాకముందు నుంచే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక సినిమాలో సంయుక్త మీనన్ హీరోయిన్గా మెరువనుంది. కాగా.. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్ కూడా ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ ను దక్కించుకుంటుంది. ఇక.. సినిమాకు సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. మేకర్స్ దీనిని 3d వెర్షన్లో రిలీజ్ చేసేందుకు ప్లాన్స్ చేస్తున్నారు.
ఈ క్రమంలోని ఎప్పుడెప్పుడు సినిమాను రిలీజ్ చేస్తారా అంటూ ఎంతో మంది అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే.. తాజా టాక్ ప్రకారం.. ఆఖండ 2 విషయంలో.. అక్కడి అభిమానులకు బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ తప్పదట. అసలు మ్యాటర్ ఏంటంటే.. ఈ 3డీ వర్షన్‌ను యుఎస్ మార్కెట్లో కాస్త ఆలస్యంగా వేయన్నారని.. అక్కడ అకండ 2 ఫస్ట్.. 2డి వర్షన్ లో మాత్రమే ప్రీమియర్స్ పడనున్నాయని సమాచారం. సో.. 3డీ వర్షన్లో ప్రీమియర్ చూద్దామనుకున్న అభిమానులకు ఇది బిగ్గెస్ట్ డేసపాయింట్మెంట్ అనే చెప్పాలి.
అయితే.. ఎంతో ఆలస్యం కాదు.. కేవలం ఒక్కరోజు లేటుగా అఖండ 3డీ షోస్ యూఎస్ లో వేయనున్నారట. సో ముందు 2డీ లో ఫ్యాన్స్ అఖండ 2 ఎంజాయ్ చేయాలి. ఇక.. సినిమాకు థమన్ మ్యూజిక్ అందిస్తుండగా.. 14 రిలీస్ ప్లస్ రామ్ అచంట, గోపీచంద్ అచంట ప్రొడ్యూసర్లుగా వ్యవహరిస్తున్నారు. డిసెంబర్ 5న పాన్ ఇండియా లెవెల్ లో సినిమా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిన టీం కచ్చితంగా ఆడియన్స్ 100% అంచనాలు పెట్టుకుంటే.. 1000% అంచనాలను అఖండ 2 అందుకుంటుంది అంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడాలి.



