ప్రజెంట్ టాలీవుడ్ పవర్ స్టార్.. ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓజీ సక్సెస్ జోష్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అదో జోష్‌లో ఉస్తాద్ భగత్ సింగ్‌తో ఆడియన్స్‌ను పలకరించడానికి పవన్ సిద్ధమవుతున్నాడు. హరీష్ శంకర్ డైరెక్షన్‌లో శ్రీ లీల హీరోయిన్గా, సాక్షి వైద్య మరో కీలక పాత్రలో మెరవనున్నారు. ఇక ఇదే జోష్‌లో ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాతో మరోసారి హిట్ కొట్టాలని పవన్ కసిగా ప్రయత్నాలు చేస్తున్నాడట. ఈ క్రమంలోనే.. తాజాగా తన షూటింగ్ పార్ట్‌ను సైతం కంప్లీట్ చేసినట్లు తెలుస్తోంది.
డబ్బింగ్ చెప్పడమే ఆలస్యం.. మరోవైపు డైరెక్టర్ హరీష్ శంకర్ సైతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించి వీలైనంత త్వరగా సినిమాను రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నాడు. మేకర్స్ సంచనాల ప్రకారం ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవి సెలవుల్లో రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారట. త్వరలో రిలీజ్ డేట్ అఫీషియల్ గా ప్రకటించనున్నట్లు టాక్ నడుస్తుంది.
సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ ని మేకర్స్ ఇప్పటికే ప్రారంభించేసారు. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన తర్వాత ప్రమోషన్స్ మరింత వేగవంతం చేయాలని ప్లాన్ చేసుకుంటున్నారట. ఇక ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యార్నేని, వై. రవి శంకర్ ప్రొడ్యూసర్లుగా రూపొందిస్తున్నారు. డీఎస్పీ సంగీతమ అందిస్తున్నారు. ఈ క్రమంలోనే.. సినిమా పై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి హైన్ మొదలైంది. ఇక.. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటుందో చూడాలి.