బాబీ నా దగ్గర అడ్వాన్స్ తీసుకొని కూడా సినిమా చేయట్లేదు.. టీజీ విశ్వ ప్రసాద్

ప్రస్తుతం టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర వరప్రసాద్ గారు సినిమా షూట్ లో బిజీగా పెడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత బాబీ డైరెక్షన్ లో మరో సినిమాకు చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఈ కాంబోలో గ‌తంలో తెర‌కెక్కిన వాల్తేరు వీర‌య్య సినిమా తెర‌కెక్కి బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే రాబోతున్న నెక్స్ట్ సినిమాపై ఆడియన్స్‌లో మంచి అంచనాలు మొదలయ్యాయి.

Chiranjeevi-Bobby : మరోసారి చిరంజీవి-బాబీ కాంబో.. కాన్సెప్ట్‌ పోస్టర్‌  రిలీజ్‌

ఇక.. ఇలాంటి క్రమంలో టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అధినేత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. బాబీ, చిరంజీవి కాంబో సినిమాపై.. డైరెక్టర్ బాబి పై షాకింగ్ కామెంట్స్‌ చేశారు. ఇటీవల ఓ సందర్భంలో టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. నాకు చిరంజీవి గారితో సినిమా చేయాలని ఎప్పటినుంచో ఉంది. దాని కోసమే ట్రై చేస్తున్నా. కొన్ని స్క్రిప్ట్‌లు కూడా ప్రయత్నించా కానీ అవి ఏవి వర్కర్ కాలేదు. డైరెక్టర్ కుదరలేదు. ఇక గతంలో డైరెక్టర్ బాబికి ఆ సినిమా కోసం అడ్వాన్స్ కూడా ఇచ్చేశా.

My goal is to produce Hollywood films: TG Vishwa Prasad of People Media  Factory - Telugu News - IndiaGlitz.com

నాకు ఇంకా సినిమా చేయలేదు. ఆయన చిరంజీవితో ఇప్పుడు రెండో సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా నాకైతే చక్కగా సెట్ అవుతుంది అనిపించింది. కానీ.. బాబి వేరే వాళ్లకు అవకాశం ఇచ్చాడు. అది తన ఇష్టం అంటూ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం టీజీ విశ్వప్రసాద్ చేసిన కామెంట్స్ వైరల్‌గా మారుతున్నాయి. వీటిపై బాబీ ఎలా రియాక్ట్ అవుతారో.. చిరు సినిమా అవకాశాన్ని విశ్వ ప్రసాద్‌కు ఎందుకు ఇవ్వలేదో వేచి చూడాల్సిందే.