” ఓజీ “టీంకు రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్.. తెలంగాణలోను పెరిగిన టికెట్ రేట్స్..

టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ ఓజీ. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా మోస్ట్ అవైటెడ్ మూవీగా సెప్టెంబర్ 25న ప్రపంచవ్యాప్తంగా ఆడియన్స్‌ను పలకరించనుంది. ఇక ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఓ గ్యాంగ్ స్టార్ గా.. ఓజాస్ గంభీర్ రోల్‌లో మెరవనున్నాడు. ప్రియాంకా అరుళ్‌ మోహన్ హీరోయిన్ గా, ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో నటించనున్న ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో అంచనాలు ఆకాశానికి అంటాయి. ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్ నెక్స్ట్ లెవెల్‌లో రెస్పాన్స్ దక్కించుకుంది. ఇక మరో ఆరు రోజుల్లో సినిమా రిలీజ్‌కు సిద్ధమవుతుంది.

ఈ క్రమంలోనే సినిమా టికెట్ రేట్లు పెంపు కోసం యూనిట్ చేసిన రిక్వెస్ట్ తెలంగాణ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేసింది. ఓజి టీంకు ఇది నిజంగా గుడ్ న్యూస్ అనే చెప్పాలి. తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్‌గా జారీ చేసిన బెనిఫిట్ షోలో సెప్టెంబర్ 24.. రాత్రి 9 గంటలకు ప్రారంభించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆ స్పెషల్ షో టికెట్ ధరలు రూ.800 ఫిక్స్ చేసింది. అంతేకాదు.. సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 4 వరకు నార్మల్ షోలా టికెట్ ధరలకు కూడా కొంతవరకు పెంచుకునే అవకాశం ఇచ్చింది. ఇక ఆ జీవో ప్రకారం.. సింగిల్ స్క్రీన్ థియేటర్లో టికెట్ రూ.100 మల్టీప్లెక్స్ థియేటర్లలో రూ.150 పెంచుకోవచ్చని ఫిక్స్ చేసింది.

ఈ డెసిషన్‌తో ఓజీ టీం ఫుల్ ఖుషి అవుతూ.. తెలంగాణ గవర్నమెంట్ కు ధన్యవాదాలు తెలియజేశారు. ఇక పవన్ అభిమానులు సైతం.. ఈ టికెట్ రేట్ల పెంపును చాలా వరకు యాక్సెప్ట్ చేస్తున్నారు. అతి తక్కువ మంది మాత్రమే ఇది మధ్య తరగతి అభిమానులకు సినిమా చూడడం మోయలేని భారం అవుతుందని చెప్తున్నారు. ఏదేమైనా టికెట్ కాస్ట్ పెరగడం వల్ల మొదటి రోజు సినిమా కలెక్షన్లపై కచ్చితంగా ప్రభావం ఉంటుందని.. ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇక ఇప్పటివరకు సినిమాపై ఉన్న హైప్‌ చాలు. మొదటి రోజు సినిమా హౌస్ ఫుల్ షోస్ పక్క అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక సినిమా రిలీజ్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే.. కలెక్షన్లు మోత మోగిపోవడం ఖాయం.