టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ డిప్యూటీ సీఎంగా విధులు నిర్వర్తిస్తూ బిజీబిజీగా గడుపుతునే.. ఇప్పటికే తన లైనప్‌లో ఉన్న మూడు సినిమాల షూట్లను కంప్లీట్ చేసిన పవన్.. ఇటీవల తాను నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రమోషన్స్‌లో సైతం సందడి చేసిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగానే.. ఇంటర్వ్యూలోను పాల్గొన్నారు. ఇక ఈ నెల 25న ఓజి సినిమాతో మరోసారి ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాలతో పాటు..ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం షూట్‌ను పూర్తి చేసి పాలిటిక్స్‌లో బిజీ అయ్యారు. కేవలం ఒక్క సాంగ్ షూట్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని సమాచారం. ఈనెల 7 నుంచి ఆ సాంగ్ షూట్ ప్రారంభమవుతుంది.
దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పవన్ పార్ట్ షూటింగ్ కూడా పూర్తయిపోతుందట. అయితే.. ఇదే ఆయన చివరి మూవీ అని అంతా భావించారు. కానీ.. ఈ సినిమాతో ఆయన ఆపడం లేదని.. ఇప్పటికే కన్నడ నిర్మాత కెవిఎన్‌కి పవన్ ఒక సినిమా చేయడానికి డేట్స్ కూడా ఇచ్చాడంటూ టాక్. ఈ సినిమాతో పాటే.. దిల్ రాజుకు కూడా ఆయనకు 30 రోజుల డేట్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే.. వీరమల్లు ప్రొడ్యూసర్ ఏ.ఏం. రత్నం వద్ద కూడా పవన్ డేట్స్ ఖాళీగా ఉన్నాయట. కాగా.. ఏ.ఏం.రత్నం, దిల్ రాజు ఇద్దరికీ సపరేట్ సినిమా కాకుండా.. వీళ్ళిద్దరు నిర్మాతలుగా పవన్ హీరోగా ఓ సినిమా చేయనున్నట్లు తెలుస్తుంది.
ఈ రెండు సినిమాలతో పాటు.. ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై కూడా ఆయన మరో సినిమా చేయనున్నట్లు సమాచారం. ఇక డైరెక్టర్ ఎవరు అని విషయాలు ఇంకా క్లారిటీ లేకున్నా.. ఈ ప్రాజెక్టులు వచ్చేయడది ప్రారంభం నుంచే పవన్ మొదలుపెడతాడని టాక్. దిల్ రాజుతో చేయబోయే సినిమా అనిల్ రావిపూడి డైరెక్షన్లో ఉండే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే కేవీఎన్ ప్రొడక్షన్స్ తో చేయబోయే సినిమాను తమిళ్ టాప్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్‌తో ఫిక్స్ చేశారు అని అంటున్నారు. మరోపక్క హెచ్ వినోద్ పేరు కూడా వినిపిస్తుంది. ఇక ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో ఈ సినిమా సినిమా వస్తుందని మొదట్లో టాక్ వినిపించినా.. ఇప్పుడు ఆ సినిమా సెట్స్‌పైకి రావడం కుదరదని.. ఈ క్రమంలోనే మరో సినిమా చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇంకా ఎస్ఆర్టి బ్యానర్ పై సినిమా డైరెక్టర్ ఎవరనే దానిపై క్లారిటీ రావాల్సి ఉంది.