మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో మన శంకర్ వరప్రసాద్ సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నయనతార హీరోయిన్‌గా నటిస్తుండగా.. వెంకటేష్ మరో ప్రధాన పాత్రలో మెరవనున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే అఫీషియల్గా వెల్లడించారు. ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సెలబ్రేషన్స్‌లో భాగంగా ఈ సినిమా గ్లింన్స్ రిలీజ్ చేశారు టీం. ఇందులో చిరంజీవి కోటు, సూటు వేసుకుని బాస్ అంటూ ఇచ్చిన స్టైలిష్ ఎంట్రీ.. మాస్ ఆడియన్స్‌నే కాదు.. క్లాస్ ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది.
ఈ క్రమంలోనే గ్లింప్స్‌వీడియోకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇక సినిమాలో విక్టరీ వెంకటేష్ ఓ కీలక పాత్రలో మెరవనున్నారని అఫీషియల్ గా ప్రకటించిన అనిల్ రావిపూడి.. ఆయన పాత్రకు సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నారు. ఇందులో చాలా నాటి రోల్ లో వెంకటేష్ నటించనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలోనే సినిమాలో వెంకటేష్‌కు సంబంధించిన మరో ఇంట్రస్టింగ్ న్యూస్ వైరల్‌గా మారుతుంది. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబర్ 3 నుంచి సినిమా సెట్స్ లో వెంకీ మామ ఎంట్రీ ఇవ్వనున్నాడట. హైదరాబాద్ ఎంఎస్జి లో.. వెంకటేష్ పోర్షన్ షూట్ జరగనిదని.. సెప్టెంబర్ 3 నుంచి ఈ పోర్షన్ ప్రారంభమవుతుందని టాక్.
ఇక.. చిరు, వెంకటేష్ ఇద్దరు కూడా కలిసి చేస్తున్న మొట్టమొదటి సీను ఓ హై వోల్టేజ్ యాక్షన్స్ సన్నివేశామని.. ఇద్దరితో కలిపి ఈ హై వోల్ట్ యాక్షన్స్ సన్నివేసాని నెక్స్ట్ లెవెల్‌లో డిజైన్ చేసినట్లు తెలుస్తుంది. ఇది మాస్ ఆడియన్స్‌కు ఫుల్ కిక్కిచ్చే అదిరిపోయే ట్రీట్ అంటూ టాక్ నడుస్తుంది. ఇక.. చిరంజీవి హీరోగా నటిస్తున్న సినిమా కావడం.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న క్రమంలో.. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్ లో మంచి అంచనాలు నెలకొన్నాయి. దానికి తోడు వెంకటేష్ కీలక పాత్రలో మెరవడం సినిమాకు మరింత ప్లస్ అయింది. ఈ క్రమంలోనే మన శంకర్ వరప్రసాద్ సినిమా రిలీజ్ అయిన తర్వాత.. ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తుందో చూడాలి.