చిరంజీవి సాంగ్ కొరియోగ్రఫీ.. నా చిరకాల కల నెరవేరింది.. పొలాకి విజయ్

టాలీవుడ్ నెంబర్ వన్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవితో కలిసి పని చేయాలని కేవలం నటినట్టులే కాదు.. డైరెక్టర్ నుంచి కొరియోగ్రాఫర్ల వరకు ప్రతి ఒక్కరూ ఆరాటపడుతూ ఉంటారు. ఇండస్ట్రీ లోకి కొత్తగా అడుగుపెట్టిన ఎంతోమంది దానికోసం తెగ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలా.. ఒకప్పుడు కలలు కన్న వారిలో నేను కూడా ఒకడినని.. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ పులికి విజయ్ వెల్లడించాడు. నా చిరకాల ఇప్పటికి నెరవేరింది అంటూ ఆనందం వ్యక్తం చేశాడు. నయనతార హీరోయిన్‌గా.. అనిల్ రావిపూడి డైరెక్షన్‌లో రూపొందుతున్న మన శంకర వరప్రసాద్ గారు సినిమాతో నా కోరిక సక్సెస్ అయిందని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సినిమా షూట్ శ‌ర‌వేగంగా జరుగుతున్న క్రమంలో.. ఈ సినిమాకు సంబంధించిన ఓ సాంగ్ షూట్ పనుల్లో టీం బిజీ బిజీగా గడుపుతున్నారు.

Polaki Vijay (@polakivijay_masterofficial) • Instagram photos and videos

ఇక ఈ సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం విజయ్‌కు దక్కడంతో ఆయన ఎక్స్ వేదికగా ఎమోషనల్ అయ్యారు. ఎవరి డ్యాన్స్ చూసే పెరిగానో.. ఎవరి స్టెప్స్ చూసి డ్యాన్స్ పై మరింత ఇష్టాన్ని పెంచుకున్నానో.. ఇండస్ట్రీకి వెళ్లాలని తపనపడ్డానో ఎవరి డ్యాన్స్ చూసి నాకు ఆయనతో ఒక్క అవకాశం వస్తుందా అని భావించానో అలాంటి.. డ్యాన్స్ గాడ్ అయిన వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారితో నాకు పని చేసే అవకాశం రావడం దేవుడిచ్చిన బిగ్గెస్ట్ గిఫ్ట్. ఆయన సాంగ్ కొరియోగ్రఫీ చేసే అవకాశం ఆనందాన్ని కల్పించింది. 2025 నా లైఫ్ లోనే ఓ బిగ్గెస్ట్ ఇయర్. ఈరోజు మా బాస్ తో నేను పని చేసే అవకాశాన్ని దక్కించుకున్న. దీనికి కారణమైన అనిల్ రావిపూడి సార్‌, సాహు గారపాటి, సుస్మిత గారు మీ అందరికీ చాలా ధన్యవాదాలు.

Polaki Vijay (@PolakiVijay) / X

ఇది ఎప్పటికీ మర్చిపోలేనంటూ ఓ లాంగ్ ఎమోషనల్ నోట్ రాసుకోచ్చాడు. ప్రతి ఒక్క డ్యాన్స‌ర్ కలా మెగాస్టార్ తో కలిసి పని చేయడం.. నాకైతే అది మరింత స్పెషల్. ఎందుకంటే నా ఫేవరెట్ హీరో.. మా అమ్మ, నాన్నలకు కూడా ఆయన అభిమాన హీరోనే. వారి ఆశీస్సులు ఉండడం వల్లే నేను ఈరోజు ఆయన వరకు చేరుకున్న అంటూ ఆనందం వ్యక్తం చేసాడు. చిరంజీవి సార్ మీ ప్రేమని ఎప్పటికీ మర్చిపోలేనని.. ఈ కటె కాలే వరకు మీ అభిమానినే అంటూ రాసుకొచ్చాడు. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ కానున్న ఈ సినిమాలో వెంకటేష్ మరో గెస్ట్ రోల్ లో నటించడం సినిమాకు మరింత హైలెట్. విజయ్‌ విషయానికి వస్తే.. కొబ్బరి మట్ట సినిమాతో తన సినీ కొరియోగ్రఫీ ప్రయాణాన్ని ప్రారంభించిన ఆయన.. పలాస మూవీలో నాక్ల‌స్‌గొలుసు, పుష్ప మూవీలో ఊ అంటావా, ఫుష్ప‌ ఫుష్ప‌, పుష్ప 2లో గంగ‌మ్మ జాత‌ర లాంటి పాపులర్ సాంగ్ కొరియోగ్రాఫర్ గా వ్యవహరించి ఆడియన్స్ కు మరింత చేరువయ్యాడు. ఈ క్రమంలోనే మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ కొట్టేశాడు.