టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా రూపొందిన మోస్ట్ ఎవైటెడ్ మూవీ ఓజీ.. ఎట్టకేలకు నిన్న గ్రాండ్ లెవెల్లో ఆడియన్స్‌ను పలకరించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో.. సినిమా కోసం ఆడియన్స్ క్యూ కడుతున్నారు. ఈ క్రమంలోనే.. ఫస్ట్ డే సినిమా భారీ కలెక్షన్లు కొల్లగొట్టినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకు.. సుజిత్ దర్శకుడుగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సుజిత్ పేరు సైతం మారుమోగిపోతుంది. ఎక్కడ చూసినా సుజిత్ గురించి టాక్ నడుస్తుంది. సుజిత్ తన నెక్స్ట్ సినిమా ఎవరితో ఉంటుందని ఆసక్తి కూడా అందరిలోనూ మొదలైంది.
ఈ క్రమంలోనే తాజాగా.. సుజిత్ తన నెక్స్ట్ సినిమాను నేచురల్ స్టార్ నానితో ప్లాన్ చేస్తున్నాడంటూ టాక్ నడుస్తుంది. గతంలో.. వీళ్ళిద్దరి కాంబోలో సినిమా సెట్ అయిన తర్వాత ఏవో కారణాలతో సెట్స్‌పైకి రాకుండా ఆగిపోయింది. ఇప్పుడు.. ఓజీ సక్సెస్‌తో మరోసారి సుజిత్ నానితో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నాడంటూ టాక్ నడుస్తుంది. నాని, శ్రీకాంత్ ఓద్దెల డైరెక్షన్‌లో ప్యారడైజ్ సినిమాలో నటిస్తున్నాడు. అది నెక్స్ట్ సమ్మర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ క్రమంలోనే.. సుజిత్ ఓజీ కోసం ఒక కథను రెడీ చేసి.. ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలని ప్రయత్నిస్తున్నాడట. గతంలో నానికి ఉన్న కమిట్మెంట్స్‌తో సుజిత్ సినిమా చేయలేకపోయాడని టాక్.
ఇప్పుడు ఓజీతో సుజిత్ మంచి ఫామ్ లో ఉన్నాడు. నాని కూడా పారడైజ్ తర్వాత ఖాళీ అవుతాడు. ఈ క్రమంలోనే.. సుజిత్ నాని కోసం కథను రెడీ చేసి ఆయనతో గ్రీన్ సిగ్నల్ ఇప్పించుకోవాలని ఫిక్స్ అయ్యాడట. సమర్‌లోగా మంచి స్క్రిప్ట్‌ను సిద్ధం చేయాలని సుజిత్ ప్లాన్ చేస్తున్నట్లు టాక్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ క్రమంలోనే.. అన్నీ కుదిరితే సుజిత్.. తన నెక్స్ట్ మూవీని నానితో కలిసి చేయనన్నాడు. ప్రెజంట్ సుజిత్ సినిమా సక్సెస్ వైబ్ లో ఉన్నారు. ఈ క్రమంలోనే నాని కూడా సుజిత సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఏం జరుగుతుంది.. సుజిత్ నెక్స్ట్ సినిమా నానితో ప్లాన్ చేస్తాడా.. లేదా.. చూడాలి.