పవన్‌ను వదలని ఆ బ్యాడ్ సెంటిమెంట్.. ‘ ఓజీ ‘ కి కూడా రిపీట్ అయ్యేనా..!

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప‌క్క‌ సినిమాలతో పాటు.. మరో పక్క రాజకీయాల్లో బిజీగా గడుపుతన్న సంగతి తెలిసిందే. అయితే.. గ‌త కొంత‌కాలంగా పవన్ నటించిన సినిమాలేవి సరైన సక్సెస్ అందుకోకపోవడంతో ఫ్యాన్స్‌ నిరాశ వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ప‌వ‌న్ సినిమాల‌ను ఓ బ్యాడ్ సెంటిమెంట్ వెంటాడుతుంద‌ని టాక్. పవన్ కు రీమేక్ సినిమాలు తప్ప.. స్టైట్‌ సినిమాలు అచ్చి రావడం లేదు. దానికి బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ రీసెంట్గా రిలీజ్ అయిన హరిహర వీరమల్లు. క్రిష్‌ జాగర్లమూడి రాసిన కథతో.. ప్రారంభ‌మైన ఈ హిస్టోరిక‌ల్ యాక్ష‌న్‌ డ్రామా.. తర్వాత జ్యోతి కృష్ణ చేతిలోకి వెళ్లడం.. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిజాస్టర్ గా నిలవడం తెలిసిందే. పవన్ కళ్యాణ్ టైటిల్ రోల్ లో మెరిసిన ఈ సినిమాలో బాబి డియోల్, నీది అగర్వాల్, సత్య‌రాజ్ తదితరులు కీలక పాత్రలో మెరిశారు.

అయితే.. రిలీజ్‌కు ముందే భారీ అంచ‌నాలను నెల‌కొల్పిన ఈ సినిమా.. బాక్సాఫీస్‌ని బ్లాస్ట్‌ చేయడం కాయమంటూ అంత ఫిక్స్ అయ్యారు. కానీ.. వీరమల్లు రిలీజ్ అయిన తర్వాత పవన్ క్రేజ్ రీత్యా.. ఓపెనింగ్స్ లో భారీ వసూళ్లనే కొల్లగొట్టిన.. మెల్లమెల్లగా కలెక్షన్లు డౌన్ అవుతూ వచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమా ఫ్లాప్ దిశగా కొనసాగుతుంది. ఇక ఈ సినిమాకు ముందు పవన్ నటించిన స్ట్రైట్ సినిమాలో అజ్ఞాతవాసి, సర్దార్ గబ్బర్ సింగ్ ఘోరమైన డిజాస్టర్స్‌. గోపాల గోపాల, కాటంరాయుడు, వకీల్ సాబ్‌, భీమ్లా నాయక్‌ లాంటి సినిమాలన్నీ వేరే సినిమాలకు రీమేక్ గా వచ్చినవే.

ఈ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకున్నాయి. పెట్టిన బడ్జెట్‌కు న్యాయం చేశాయి. దీంతో పవన్ సైతం రీమేక్ సినిమాల వైపే ఆసక్తి చూపుతున్నాడట. ప్రస్తుతం పవన్ చేతిలో రెండు ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ ఒకటి కాగా.. మరొకటి ఓజి. ఉస్తాద్ భ‌గ‌త్ సింగ్ రీమేక్ సినిమానే కావడంతో ఫ్యాన్స్‌కు టెన్షన్ లేకున్న‌..ఓ జి స్టోరీ మాత్రం కొత్తది. ఈ క్రమంలోనే ఈ స్ట్రైట్ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో.. ఓ జికి కూడా ఆ బ్యాడ్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందేమో అని ఆందోళన ఫ్యాన్స్ లో మొదలైంది.