టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా, ఎన్డీఏ కీలక నాయకుడిగా రాజకీయాల్లో దూసుకుపోతున్నారు. ఇప్పటికే తాను కమిటైన సినిమాలలో గ్యాప్ ఉన్నప్పుడలా నటిస్తూ సినిమా షూట్లను కంప్లీట్ చేస్తున్నాడు. ప్రస్తుతం హరీష్ శంకర్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూట్‌లో సందడి చేస్తున్న పవన్.. ఈ సినిమాను సెప్టెంబర్ నాటికి పూర్తి చేయనున్నాడు.
ఇక సినిమాలో పవన్ పోలీస్ ఆఫీసర్‌గా, శ్రీ లీల, రాశి కన్నా హీరోయిన్లుగా కనిపించనున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై 2026లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి అయిన వెంటనే పవన్ సినిమాలకు దాదాపు యాడదిన్నరపాటు బ్రేక్ ఇవ్వనున్నాడట. సార్వత్రిక ఎన్నికల ముందు ఒకటి.. లేదా రెండు సినిమాలు చేయాలని ఆయన అనుకుంటున్నాడు.. కానీ రాజకీయాల వల్ల కుదిరితే ఆ సినిమాలుకు సమయం కేటాయిస్తాడని.. లేదంటే మరింత బ్రేక్ పడే అవకాశం ఉందని సమాచారం.
అదే టైంలో ఆయన తనయుడు అకీరానందన్ ను హీరోగా లాంచ్ చేయడానికి పవన్ ప్లాన్ చేస్తున్నాడట. రాజకీయాలే ఆయన ప్రాధాన్యతగా ఉన్న సినిమాలు నుంచి.. రిటైర్ మాత్రం కానని.. సినిమాలే ఆదాయ వనరు కనుక పవన్ సినిమాల్లోనూ ఇటు రాజకీయాల్లో రెండు సమన్వయంగా సాగనన్నాడని ఇండస్ట్రీ వార్గాల సమాచారం.