కొలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్.. సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ కాంబోలో మోస్ట్ అవైటెడ్ మూవీ కూలీ ఒకటి. కొన్ని గంటల క్రితం గ్రాండ్ లెవెల్లో ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అయిన ఈ సినిమా.. రిలీజ్‌కు ముందే.. టీజర్, ట్రైలర్ సాంగ్స్ ఇలా.. ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌తోను ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. రజినీ అభిమానులతో పాటు.. సినీ ప్రియులలోను ఆసక్తి నెలకొల్పింది. ఈ క్రమంలోనే.. బుకింగ్స్ ఓపెన్ అయినా క్షణాల్లోనే టికెట్లు హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. ఇక దియేటర్ల వద్ద సైతం టికెట్ల కోసం బారులు తీరారు జనం. ఇలాంటి క్రమంలో.. సినిమా రిలీజై ఎలాంటి రిజల్ట్ అందుకుంది.. అసలు రజినీ ఆడియన్స్‌ను మెప్పించాడా.. లేదా.. చూద్దాం.
స్టోరీ:
స్టోరీ వైజాగ్ పోర్టల్ నుంచి మొదలవుతుంది. కింగ్‌పిన్ లాజిస్టిక్స్ పేరుతో సైమన్ (నాగార్జున) పెద్ద మాన్షన్ రన్ చేస్తూ.. డాన్‌గా కొనసాగుతూ ఉంటాడు. కాస్ట్లీ వాచెస్, ఎలక్ట్రానిక్స్ విదేశాలకు ఇల్లీగల్గా ఎక్సపోర్ట్ చేస్తాడు. అయితే ఎక్స్పోర్ట్ ముసుగులో.. చేయకూడని తప్పే చేస్తారు. సైమన్ అండర్లో.. దయాల్ (సౌబిన్ షాహిర్) దీని పర్యవేక్షిస్తూ ఉంటాడు. వీళ్ళ దగ్గర పనిచేసే రాజశేఖర్ (సత్యరాజ్) సడన్గా చనిపోతాడు. ఇక రాజశేఖర్ ప్రాణ స్నేహితుడే దేవా(రజినీ). వీళ్ళిద్దరూ కొన్ని కారణాలవల్ల 30 ఏళ్ల పాటు దూరంగా ఉంటారు. ఇలాంటి క్రమంలో ప్రాణ స్నేహితులు చనిపోయాడనే విషయం తెలుసుకున్న దేవా.. వైజాగ్ కు వెళ్తాడు. తర్వాత అసలు ఏం జరిగింది.. అసలు ఇంతకీ ప్రాణ స్నేహితులు ఎందుకు 30 ఏళ్లు దూరం అవ్వాల్సి వచ్చింది.. సైమన్, దేవలకు మధ్యన అసలు కనెక్షన్ ఏంటి.. ఇంతకీ కలిషా (ఉపేంద్ర) ప్రీతి (శృతిహాసన్) దాహ (అమీర్ ఖాన్) ఎవరు.. వాళ్ళు ఎందుకు వచ్చారు.. తెలియాలంటే మూవీలో చూడాల్సిందే.
రివ్యూ:
ఈసారి కూడా లోకేష్ మరోసారి తన మార్క్ క్రియేట్ చేసుకోవాలని.. తనను తాను ప్రూవ్ చేసుకోవాలని ఎంతగానో ప్రయత్నించాడు. కానీ.. కథ రొటీన్ గా అనిపించడంతో కాస్త తడబడ్డాడు. కథనంలో మాత్రం చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ఆడియన్స్‌ని మాయ చేసాడు. ముఖ్యంగా.. ఫస్ట్ హఫ్ ఆడియన్స్‌కు తెగ నచ్చేసింది. ఈ సినిమాలో చాలా క్యారెక్టర్‌లు ఉన్న క్రమంలో ప్రేక్షకులు ఏ క్యారెక్టర్‌తో రన్ అవాలనేది కొంతవరకు కన్ఫ్యూషన్ గా అనిపించినా.. రజినీ క్యారెక్టర్‌ను హుక్ చేసి.. మిగతా క్యారెక్టర్లు దానికి సపోర్ట్ గా వాడుకోవాలని విషయాన్ని లోకేష్ తన స్టైల్ లో చాలా క్లియర్ కట్ గా చూపించడంలో సక్సెస్ అయ్యాడు.
ముఖ్యంగా.. వింటేజ్ రజినీకాంత్ ను ఆడియన్స్ కు పరిచయం చేశాడు. ఆయనలో ఉన్న స్వాగ్‌ను నెక్స్ట్ లెవెల్ లో ఎలివేట్ చేసాడు. సెకండ్ హాఫ్ లో స్టోరీ కాస్త స్లో అయిన ఫీల్ కలిగినా.. యాక్షన్ సీన్స్‌తో దాని కవర్ చేసే ప్రయత్నం చేశాడు. ముఖ్యంగా.. ప్రీ క్లైమాక్స్ లో ఎలివేషన్.. నెక్స్ట్ లెవెల్లో ఆకట్టుకుంటాయి. ఇక క్లైమాక్స్ లో వచ్చే ట్విస్ట్ ఆడియన్స్ కు కచ్చితంగా కనెక్ట్ అయ్యేలా డిజైన్ చేశాడు. ఇక అనిరుధ్ మ్యూజిక్ అదరగొట్టేసాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో ఎక్కడా కాంప్రమైస్ కాకుండా శ్రద్ధ తీసుకొని మరోసారి తన మార్క్ చూపించాడు. ముఖ్యంగా రజనీకాంత్ ఎంట్రీ అప్పుడు ఆడియన్స్‌లో గూస్ బంప్స్ లనే రేంజ్‌లో బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఉంది.
నాగ్ ఎంట్రీ అప్పుడు వచ్చిన బిజీయం మెప్పించింది. మొత్తానికి సినిమాలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ప్రధాన పాత్ర వహించిందనే చెప్పాలి. ఇక నాగార్జున రోల్ సినిమాకి హైలైట్ అనిపించింది. ఆర్టిస్టులందరినీ నడివి ప్రకారం పర్ఫెక్ట్ గా వాడుకున్నాడు లోకేష్. అయితే.. క్యారెట్రైజేషన్ డీటెయిల్ పై పెట్టిన ఫోకస్.. స్టోరీ పై పెట్టలేదని సినిమా చూస్తే క్లియర్ గా అర్థమవుతుంది. ముఖ్యంగా స్క్రీన్ ప్లే పై కూడా ఆయన చాలా కష్టపడ్డారు. కానీ.. డైరెక్షన్‌లో తడబడాడు. ప్రతి క్యారెక్టర్ ను వైవిధ్యంగా చూపించి ఆడియన్స్‌ను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తాడు. డైరెక్షన్ విషయంలో మాత్రం లోకేష్ గత సినిమాలు విక్రమ్, లియో సినిమాలో ఎఫర్ట్స్ కనిపించలేదు.
నటీనటుల పర్ఫామెన్స్
దేవా గా.. రజనీకాంత్ తన పర్ఫామెన్స్ తో ఆకట్టుకున్నాడు. నటించడం కాదు.. ఒక మాటలో చెప్పాలంటే జీవించేసాడు. తన మార్క్ స్టైల్, డైలాగ్స్, యాక్షన్ సీన్స్ వచ్చినప్పుడు థియేటర్‌లో విజిల్స్ మోతమోగిపోయింది. నాగార్జున.. సైమన్ రోల్ కి ఎంతలా ఇంపార్టెన్స్ ఉందంటే.. సినిమాకు నాగార్జున పాత్ర వెన్నెముక అయిపోయింది. విలనిజం లోను ఒక డిఫరెంట్ షేడ్ చూపించిన నాగార్జున.. ఆడియన్స్‌ను భయపెట్టాడు. ఈ సినిమాతో విలన్ గాను నాగార్జున అదరగొట్టగలరని ప్రూవ్ చేసుకున్నాడు. ఇక ఉపేంద్ర తనదైన స్టైల్‌తో ఆకట్టుకున్నాడు. శృతిహాసన్ సైతం తన పాత్ర పరిధి మేరకు 100% ఇచ్చింది. సత్యరాజ్ ఈ సినిమాల్లో డిఫరెంట్ షేడ్స్ తో మెరిసాడు. మునుపెన్నడూ లేని ఒక వైవిధ్యమైన రోల్ ను ఎంచుకొని తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకున్నాడనే చెప్పాలి.
టెక్నికల్ గా:
సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ హైలెట్గా నిలిచింది. కొన్ని ఎలివేషన్ సీన్స్ లో అనిరుధ్ బ్యాగ్రౌండ్ స్కోర్ నెక్స్ట్ లెవెల్ అనే చెప్పాలి. ఈ మ్యూజిక్ వల్లే సినిమా గ్రాఫ్ మరింతగా పెరిగిందనడంలోనూ అతిశయోక్తి లేదు. ముఖ్యంగా.. బ్యాక్ షాట్స్ అయితే ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతాయి. వాటితోనే లోకేష్ కొంతవరకు మ్యాజిక్ చేసాడు. ప్రొడక్షన్ వాల్యూస్ ఎక్కడ తగ్గకుండా చాలా రిచ్ గా చూపించారు.
ప్లస్ లు, మైనస్ లు:
సినిమాకు రజినీకాంత్ యాక్టింగ్ ప్లస్. మ్యూజిక్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఇక విజువల్స్ తోను లోకేష్ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. డైరెక్షన్‌లో కాస్త తడబడటమే సినిమాకు మైనస్ అయింది. సెకండ్ హాఫ్‌లో కొన్ని సీన్స్ అసలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇవి కొంతమేర సినిమాకు మైనస్.
రేటింగ్: 3/5