తెలుగు బుల్లితెర యాంకర్‌గా తిరుగులేని క్రేజ్ సంపాదించుకున్న అనసూయకు.. టాలీవుడ్ ఆడియన్స్‌లోను ప్రత్యేక పరిచయం అవసరం లేదు. యాంకర్‌గా గ్లామర్ షోను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఈ ముద్దుగుమ్మ.. వెండితెరపై కూడా పలు సినిమాల్లో కీలకపాత్రలో నటించి ఆకట్టుకుంది. సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ ఎప్పటికప్పుడు హాట్ ఫోటోలతో కుర్రకారకు చెమటలు పట్టిస్తుంది. ఈ క్రమంలోనే.. స్టార్ హీరోయిన్ రేంజ్‌లో ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న అనసూయ.. ఎప్పటికప్పుడు ఏదో రకమైన వార్తల్లో వైరల్ అవుతూనే ఉంటుంది. అంతేకాదు.. దానికి తగ్గట్టుగానే ఆమెపై వచ్చిన రూమర్లకు స్ట్రాంగ్ కౌంటర్లు ఇచ్చేస్తుంది.
రీసెంట్గా ఓ షాప్ ఓపెనింగ్ ఈవెంట్‌కు వెళ్లిన ఈ అమ్మడు స్టేజిపై చెప్పు తెగుద్ది అంటూ బోల్డ్‌గా ఫ్యాన్స్ కు వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. కాగా.. రీసెంట్గా హరిహర వీరమల్లు సినిమాలో పవన్‌తో స్క్రీన్ షేర్ చేసుకుని ఆడియన్స్‌ను ఆకట్టుకున్న ఈ అమ్మడు.. కొల్లగొట్టినాది రో సాంగ్‌లో తన స్పెషల్ పెర్ఫార్మెన్స్ తో శభాష్ అనిపించుకుంది. అమ్మడిపై ప్రశంసలు కురిసాయి. ఈ క్రమంలోనే మరో స్పెషల్ ఐటమ్ సాంగ్‌కు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాక్ వైరల్ గా మారుతుంది. అది కూడా.. మెగా హీరోతో కావడం విశేషం. ఆ మెగా హీరో మరెవరో కాదు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.
గ్లోబల్ లెవెల్ లో చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూట్ లో బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూట్ శరవేగంగా జరుగుతుంది. ఇక ఈ క్రమంలోనే.. పెద్ది స్పెషల్ సాంగ్ విషయంలో మేకర్స్‌కు బిగ్ కన్ఫ్యూజన్‌లో ఉన్నారట. ఏ హీరోయిన్ తో ఐటమ్ సాంగ్ చేయాలనే ఆలోచనచేసిన టీం.. నిన్న మొన్నటి వరకు శ్రీలీల అనుకున్నా.. ఇప్పుడు ఆమె కాకుండా మరి ఎవరైనా హాట్ అండ్ గ్రేసీ బ్యూటీని సెలెక్ట్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే అనసూయను ఫైనలైజ్ చేసినట్లు టాక్ వైరల్ గా మారుతుంది. ఇక ఈ వార్తల్లో వాస్తవం ఎంత తెలియదు గాని.. నిజంగానే బుచ్చిబాబు.. పెద్ది మూవీలో అనసూయ ఛాన్స్ కొడితే మాత్రం జాక్పాట్ కొట్టినట్లే అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.