ప్రతి ఏడాది సెప్టెంబర్ 2 వచ్చింది అంటే చాలు.. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద పండుగ మొదలైపోతుంది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఫ్యాన్స్ అంతా తెగ సందడి చేస్తూ ఉంటారు. ప్రతి చోట బ్యానర్లు, కటౌట్లు, సేవా కార్యక్రమాలతో మారుమోగిపోతూ ఉంటుంది. పవన్ కు సంబంధించిన పాత సినిమాల రిలీజ్.. కొత్త సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్నో సర్ప్రైజ్లు.. ఫ్యాన్స్ కు కనువిందు చేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే వచ్చేపెల 25న పవన్ ఫ్యాన్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఓజీ సినిమా ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
దీంతో ఈ ఏడాది సెప్టెంబర్ 2.. పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ ఆడియన్స్ లో మరింత జోష్ను పెంచేలా ఫ్యాన్స్ బలంగా సినిమా బ్లాక్ బస్టర్ అని ఫిక్స్ అయ్యేలా ఏదో ప్లాన్ చేస్తున్నారట. ఈ సినిమాతో పాటే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా సైతం సైట్స్ పై ఉన్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా నుంచి కూడా పవన్ పుట్టినరోజు నాడు ఓ సర్ప్రైజ్ రానుందట. అలా పవన్ ఫ్యాన్స్ కి ఏడాదిలో కేవలం డబల్ ధమాకా కాదు.. జల్సా రీ రిలీజ్‌తో త్రిబుల్ ధమాకా సిద్దమయింది. అయితే.. ప్రతి ఏడాది రీ రిలీజ్‌ల కోసం ఎదురుచూసిన అభిమానులు ఈసారి సినిమాల కోసం కాదు.. ఓజి సినిమా పైన ఫోకస్ పెట్టారు.
ఈ సినిమాకు సంబంధించిన ఎలాంటి అప్డేట్ రిలీజ్ చేస్తారో అనే ఆత్రుత అందరిలోనూ కనిపిస్తుంది. ఈ క్రమంలోనే పవన్ ఫ్యాన్స్ అంత ఎనర్జీ, మనీ రీ రిలీజ్ సినిమాల కోసం ఖర్చు చేయకూడదని ఫిక్స్ అయ్యారట. ఇదే టాక్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్ గా మారుతుంది. ఇక సెప్టెంబర్ 2న ఓజి సినిమాకు సంబంధించిన ఓ పవర్ ప్యాక్‌డ్ యాక్షన్ టీజర్ రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. విలన్ ప్రపంచం పైనే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఇప్పటివరకు సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రతి ప్రమోషనల్ కంటెంట్‌కు ఆడియన్స్ లో మంచి రెస్పాన్స్ దక్కింది. ఇదే రేంజ్‌లో రెస్పాన్స్ కూడా వస్తుందో.. లేదో.. చూద్దాం.