రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ మూవీ కింగ్డమ్. తెలుగులోనే కాదు.. తమిళ్, కన్నడ, మలయాళం లోనే తాజాగా సినిమా తమిళ్ వర్షన్‌లో దాదాపు రూ.2.50 కోట్ల గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టి క్రేజీ రికార్డ్‌ను ఖాతాలో వేసుకుంది. మలయాళం ఇండస్ట్రీలో కోటి రూపాయల గ్రాస్ కలెక్షన్లు కొల్లగొట్టిన మొట్టమొదటి తెలుగు మూవీ గా రికార్డ్ సృష్టించింది. అక్కడ మలయాళ వర్షన్ కాకుండా డైరెక్ట్ తెలుగు వర్షన్‌లో ఈ రేంజ్ వసూలు రాబట్టడం మరో విశేషం. అక్కడున్న తెలుగు ఆడియన్స్‌తో పాటు.. మలయాళ ఆడియన్స్ అయితే ఈ సినిమాను చూసి పాజిటీవ్‌గా రియాక్ట్ అవుతున్నారు.
తెలుగు నుంచి రికార్డు అందుకున్న ఏకైక సినిమా కింగ్డమ్. ఈ క్రమంలోనే తాజాగా నాగ వంశీ మాట్లాడుతూ కేరళలో కింగ్డమ్ సినిమాకు వస్తున్న కలెక్షన్స్ షాక్ కలిగిస్తున్నాయంటూ అభిప్రాయాలను వ్యక్తం చేశాడు. ఫస్ట్ వీక్ సక్సెస్ఫుల్ జర్నీ మొదలుపెట్టిన ఈ సినిమా భారీ సంఖ్యలో టికెట్ బుకింగ్ జరుపుకుంటుందని.. మరోవైపు ఓవర్సీస్‌లోను ఇదే రేంజ్‌లో వసూళ్లు కొల్లగొడుతుందని చెబుతున్నారు. విజయ్ దేవరకొండ కెరీర్‌లో ఈ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలబడిందట.
అలాగే.. సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ బ్లాక్ బస్టర్ హీట్‌లలో ఈ సినిమా కూడా చేరిపోతుందంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక కింగ్డమ్ మొదటి నాలుగు రోజులపాటు ప్రపంచవ్యాప్తంగా రూ.90 కోట్ల వరకు గ్రాస్.. రూ.46 కోట్ల షేర్ వసూళ్లను రాబడినట్లు ట్రేడ్ వర్గాలు వివరించాయి. మొత్తంగా (సోమవారం) నేటి నుంచి ఈ సినిమాకు అసలు కాంపిటేషన్ మొదలవుతుంది. సోమవారం బాక్స్ ఆఫీస్ దగ్గర పాస్ అయితే.. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయినట్లే. మొత్తంగా టోటల్ బిజినెస్‌కు మరో రూ.7 కోట్ల షేర్ రాబడితే చాలు సినిమా బ్రేక్ ఈవెన్ అవుతుంది.