విజయవాడలో ‘ వార్ 2 ‘ ప్రీ రిలీజ్ ఈవెంట్.. హృతిక్, తారక్ ఎంట్రీ తో హైప్ డబుల్..!

బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్, టాలీవుడ్ యంగ్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ స్పై థ్రిల్లర్ మూవీ వార్ 2 రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. భారీ అంచనాలతో రూపొందిన ఈ సినిమా కోసం సినీ ఆడియన్స్ అంతా కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే మూవీ టీం సినిమా పై మరింత హైప్‌ పెంచేందుకు గ్రాండ్ లెవెల్‌లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్ర‌మంలోనే ఆగస్టు 10న విజయవాడలో అంగరంగ వైభవంగా సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగనుంది. ఇక ఈవెంట్‌లో హృతిక్, తారక్ సందడి చేయనున్నారని టాక్ వైరల్ గా మారుతుంది.

War 2 Trailer Review: Jr NTR Vows Marunga Ya Maarunga, Looks Right Into Hrithik  Roshan's Eye But Hey Ayan Mukerji, Sorry, But I Hate Anything Vanilla!

ఈ క్రమంలోనే ప్రీ రిలీజ్ ఈవెంట్‌పై ఆడియ‌న్స్‌లో భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. గతంలో.. ఈ సినిమా ప్రమోషన్స్‌లో ఇద్దరు స్టార్ హీరోలు ఎక్కడా కలిసి కనిపించరని.. వెండితెరపై డైరెక్ట్ గా వీళ్ళిద్దరి ఫేస్ టు ఫేస్ వార్ ఇంట్రెస్ట్ గా చూపించనున్నార‌ని సమాచారం ప్రకారం.. విజయవాడలో నిర్వహించనున్న ఫ్రీ రిలీజ్ ఈవెంట్‌కు హృతిక్, తారక్ ఇద్దరు హాజరుకానున్నారట. సినిమాలో హృతిక్ రోషన్, ఎన్టీఆర్ ల మధ్య హై స్టేట్స్ ఆఫ్ యాక్ష‌న్‌సినిమాకు మోస్ట్ హైలెట్ గా నిలవనుందని చెప్తున్నారు. ఈ భారీ యాక్షన్ సినిమాలో కియారా అద్వానీ ప్రధాన పాత్రలో నటించగా.. ఈ సినిమాను 2019లో వచ్చిన సూపర్ హిట్ వార్ సినిమాకు సీక్వెల్‌గా.. ఆదిత్య చోప్రా ప్రొడక్షన్ లో.. యష్‌ రాజ్ ఫిలింస్ స్పై యూనివర్సిటీలో భాగంగా ఈ తెర‌కెక్కుతుంది.

ఇప్పటికే.. ఈ బ్యానర్ పై ఏక్తా టైగర్, టైగర్ జిందా హై, వార్, ప‌ఠాన్‌, టైగ‌ర్ 3 లాంటి బ్లాక్ బస్టర్ సినిమాలు రిలీజై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే వార్ 2పై కూడా ఆడియన్స్ లో మంచి హైప్ నెలకొంది. హృతిక్ రోషన్ కబీర్ పాత్రలో.. ఎన్టీఆర్ విక్రమ్ రోల్ లో కనిపించనున్నారు. వీరిద్దరి మధ్యన జరిగే ఎగ్జైటింగ్ వార్‌.. సినిమాకు హైలెట్గా.. మేకర్స్ తీర్చినట్లు సమాచారం. ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్‌లో భాగంగా.. ఆగస్టు 14న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ లెవెల్లో రిలీజ్ చేయనున్నారు. ఇక గతంలో ఎన్నో బ్లాక్బస్టర్ సినిమాలను అందించిన సక్సెస్ఫుల్ స్టార్ట్ డైరెక్టర్ ఈ సినిమాకు దర్శకుడుగా వ్యవహరించారు. అయితే.. ఈ సినిమాకు సౌత్ బాక్సాఫీస్ దగ్గర స్ట్రాంగ్ కాంపిటీషన్ నెలకొంది. అదే రోజున.. కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ కూలి సినిమా కూడా రిలీజ్ అవుతుంది. ఈ క్రమంలోనే రెండు సినిమాల్లో ఏ సినిమాకు ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో.. ఈ పోటీ లో ఎవరు నెగ్గుతారో చూడాలి.