చిరు మూవీలో గెస్ట్ రోల్.. ఎలా ఉంటుందో లీక్ చేసేసిన వెంకీ మామ‌..!

తెలుగు సీనియ‌ర్‌ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్.. తాజాగా అమెరికాలో గ్రాండ్ లెవెల్లో జరిగిన నాట్స్ 2025 సెలెబ్రేషన్స్‌లో సందడి చేశాడు. ఇక ఈ ఈవెంట్లో వెంకటేష్ తన సినిమాలైన గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఆయన మూవీస్ లిస్ట్ గురించి చేసిన కామెంట్స్‌ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. చాలా రోజులుగా అనిల్ రావిపూడి, చిరు కాంబో మూవీలో విక్టరీ వెంకటేష్ గెస్ట్ రోల్‌లో నటిస్తున్నాడని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇది వాస్తవమ‌ని వెంకీ మామ క్లారిటీ ఇచ్చేశాడు.

ఆ పాత్ర ఎలా ఉంటుందో ఆయ‌న చెప్పుకొచ్చాడు. మాటల‌ మాంత్రికుడు త్రివిక్రమ్‌తో త‌ను ప్రాజెక్ట్ చేస్తున్న అంటూ చెప్పుకొచ్చిన వెంకీ మామ.. అలాగే చిరు సినిమాలో గెస్ట్ రోల్ లో నటిస్తున్నానంటూ వివరించాడు. అది కూడా త‌న రోల్ చాలా ఫన్నీగా ఉండబోతుందని.. ప్రేక్షకుల్లో నవ్వులు పంచుతుందంటూ వివరించాడు. అంతేకాదు.. మీనా తో కలిసి దృశ్యం 3 సినిమా చేస్తున్నానంటూ చెప్పుకొచ్చిన వెంకటేష్.. ఇటీవల అనిల్ రావిపూడితో సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో హిట్ కొట్టం. మేమిద్దరం మళ్ళీ కలిసి రాబోతున్నామంటూ వివరించాడు. వీటన్నింటితో పాటు.. మరో భారీ ప్రాజెక్టులో నా స్నేహితుడితో కలిసి పనిచేస్తున్నాను.. తెలుగు ఇండస్ట్రీలో ఆయన ఓ పెద్ద స్టార్ అంటూ వెంకటేష్ వివరించాడు.

Cine Muchatlu | Chiru and Venky Mama ❤️ #chiranjeevi #venkatesh  #cinemuchatlu | Instagram

తనపై ప్రేమాభిమానాలు చూపుతున్న అభిమానులకు నాట్స్ వేదికగా ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు వెంక‌టేష్‌. ఇక ఈ ఏడాది సంక్రాంతి పండుగకు.. సంక్రాంతికి వస్తున్నాంతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న అనిల్ రావిపూడి.. చిరంజీవి హీరోగా మెగా 157తో.. నెక్స్ట్ సంక్రాంతికి మరోసారి ఆడియన్స్‌ను పలకరించనున్నాడు. ఇక ఈ సినిమాలో వినోదంతో పాటు.. బలమైన భావోద్వేగాలు, యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ సినిమా రూపొందనుంది. ఇందులో వెంకటేష్ గెస్ట్ రోల్ చేయ‌నున్నారు. చిరు, నయ‌నతార జంటగా నటిస్తున్న ఈ సినిమాలో.. ఆయ‌న ఒరిజిన‌ల్ నేమ్‌ శివశంకర వరప్రసాద్ పేరుతో స్క్రీన్‌పై క‌నిపించ‌నున్నాడు.