టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎట్టకేలకు నాలుగేళ్ల షూట్ తర్వాత వీరమల్లును కంప్లీట్ చేసుకుని ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్నాడు. ఈ సినిమాకి వారం రోజుల క్రితం వరకు సోషల్ మీడియాలో విపరీతమైన నెగెటివిటీ వచ్చినా.. ఇప్పుడు మాత్రం సినిమా గురించి ఎక్కడ చూసినా పాజిటివ్ న్యూస్ తెగ వైరల్ గా మారుతుంది. ఈ రేంజ్‌లో సడన్ ఛేంజ్ రావడానికి ముఖ్య కారణం జూలై 3న రిలీజ్ అయిన ధియేట్రికల్ ట్రైలర్ అనడంలో సందేహం లేదు.
ఈ ట్రైలర్ ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. అద్భుతమైన రెస్పాన్స్ని దక్కించుకుంది. ఈ క్రమంలోనే వీరమల్లు ట్రైలర్ చూసిన ఆడియన్స్ కు సినిమాలో చాలా పెద్ద మేటరే ఉందని.. కచ్చితంగా సినిమా హిట్ అవుతుందనే క్లారిటీ వచ్చింది. ఈ క్రమంలోనే తాజాగా సినిమా అడ్వాన్స్ బుకింగ్ సైతం మొదలయ్యాయి. ఇక ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ రాత్రి ప్రారంభం కాగా.. పవన్ కళ్యాణ్ రేంజ్‌కు తగ్గట్టు విరమలు బుకింగ్స్‌తో సంచలనం సృష్టించింది. ఎవరు ఊహించని రేంజ్‌లో నిమిషాలలోనే హాట్ కేకుల టికెట్స్ అమ్ముడుపోయాయి.
అభిమానులు కూడా అసలు గెస్ చేయని విధంగా ఈ బుకింగ్స్ జరగడం విశేషం. ఇప్పటివరకు కేవలం 60 షోలకు సంబంధించిన బుకింగ్స్ మాత్రమే మొదలు పెట్టగా.. 60 షోలకు దాదాపు 70 వేల డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అంటే.. సినిమాకు ఏ రేంజ్‌లో క్రేజ్ పాపులారిటీ నెలకొంది అర్థం చేసుకోవచ్చు. కేవలం 30 నిమిషాల్లో 140 టికెట్లు అమ్ముడుపోయాయి. దీన్నిబట్టి.. ట్రైలర్ తో ఆడియన్స్ లో సినిమాపై ఏ రేంజ్ లో హైప్ క్రియేట్ చేశారో అర్థమవుతుంది. ఇక ఇదే క్రేజ్ కొనసాగితే మూడు మిలియన్ డాలర్ల ప్రీమియర్స్ ని కొల్లగొట్టిన ఆశ్చర్యపోనవసరం లేదని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.