టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మొదటి పాన్ ఇండియన్ మూవీ హరిహర వీరమల్లు జూలై 24న గ్రౌండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. ఇక సినిమా పవన్ డిప్యూటీ సీఎం గా మారిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఫ్యాన్స్ లో సినిమా పై విపరీతమైన బజ్ క్రియేట్ అయింది. తాజాగా సినిమా టీం ప్రమోషన్స్ తో భాగంగా స్పెషల్ ప్రస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్ సందడి చేశాడు. ఆయన మాట్లాడుతూ.. రాజకీయ ప్రెస్ మీట్‌లో ఎన్నోసార్లు ధైర్యంగా మాట్లాడేశా.. కానీ సినిమా ప్రెస్మీట్లో మాట్లాడటం కాస్త ఇబ్బందిగా ఉంటుంది అని చెప్పుకొచ్చాడు. ఇక ఈ ప్రెస్ మీట్ ప్రొడ్యూసర్ ఏ.ఏం.రత్నం గారి గురించే పెట్టానని.. ఆయన సినిమా కోసం ఎంతగానో కష్టపడ్డారు.
నేను రాజకీయాల్లో పడి సినిమా కోసం పూర్తిగా సమయం కేటాయించకపోయినా.. ఆయన టైం అడ్జస్ట్ చేస్తూ సినిమా పూర్తి చేశారు. ఇక క్రిష్ నా దగ్గరకు అద్భుతమైన కాన్సెప్ట్ తీసుకొచ్చారు. ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అంటూ చెప్పుకొచ్చాడు. నిధి అగర్వాల్ గురించి మాట్లాడుతూ సినిమా ప్రమోషన్స్ తన భుజాలపై మోస్తూ ఇంటర్వ్యూలో సందడి చేస్తుందని.. ఎంతో కష్టపడుతుందని నిధి అగర్వాల్ ను ప్రశంసించిన పవన్.. నాకే సినిమాను అనాధలో వదిలేసాను అనిపించిందని నేను సినిమాను వదిలేయలేదు.. ఈ సినిమా కోసం నేను ఉన్నాను అని చెప్పడానికే ఈ ప్రెస్‌మీట్‌కు వచ్చాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక సినిమా గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను షేర్ చేసుకున్న పవన్.. కచ్చితంగా సినిమా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది అంటూ చెప్పుకొచ్చాడు.
సినిమా నాకు అన్నం పెట్టింది అది ఎప్పటికీ మర్చిపోను. సినిమా నాకు ప్రాణవాయుక్త సమానం అంటూ చెప్పుకోవాల్సిన పవన్.. మన గవర్నమెంట్ సినీ ఇండస్ట్రీని ఎంతగానో ఆదరిస్తుంది.. అందుకే సినిమా ప్రచారంలో భాగం కావాలని వచ్చా. భారతీయ సినిమాలకు కులమత బేధాలు ఉండనే ఉండవు. క్రియేటివిటీ మీదే అంత ఆధారపడి ఉంటుంది. అది ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చిరంజీవి అయినా.. చిరంజీవి కొడుకు, తమ్ముడైన.. ఇంకెవరైనా టాలెంట్ ఉంటేనే ఇక్కడ నిలబడతాం. రేపు నా కొడుకు అయినా అంతే.. అంటూ పవన్ కామెంట్స్ చేసాడు. దీంతో నిన్న మొన్నటి వరకు ఆకిరా ఎంట్రీ పై సందేహాలు ఉన్నా.. ఇప్పుడు ఆఖీరా సినీ ఎంట్రీ కన్ఫామ్ అని క్లారిటీ వచ్చేసింది. ఎప్పటినుంచో అఖీర సినీ ఎంట్రీ ఏ దర్శకుడుతో ఉండబోతుందనేది హార్ట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. గతంలో ఎంతోమంది దర్శకుల పేర్లు కనిపించిన.. చివరిగా మాత్రం క్రిష్ డైరెక్షన్లో ఆకిర ఎంట్రీ ఉండబోతుంది అంటూ టాక్ వైరల్ గా మారింది. మరి.. ముందు ముందు ఏం జరుగుతుందో వేచి చూడాలి.