టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సిఎంగా మారిన తర్వాత నుంచి వచ్చిన మొట్టమొదటి మూవీ హరిహర వీరమల్లు. గురువారం గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు.. బుధవారం రాత్రి 9:30 నుంచి ప్రీమియర్ షోస్ పడ్డాయి. ఇక ప్రీమియర్ షోస్ నుంచి సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే భారీ లెవెల్ లో కలెక్షన్లు కల్లగొట్టి దూసుకుపోయిన వీరమల్లు.. ఫస్ట్ డే కూడా అదే రేంజ్ లో జోరు చూపించి బ్లాక్ బస్టర్ వసూళ్లను సొంతం చేసుకుందట.
ఇక ఈ మూవీ పై నెగిటివిటీ పెంచేందుకు పవన్ హటర్స్ ఎన్నో రకాలుగా ప్రయత్నించారు. ఇందులో భాగంగానే రాజకీయ పరంగాను వైసీపీ అభిమానులు సినిమాపై విమర్శలు చేస్తూ.. బాయ్‌కాట్ వీరమల్లు అని తెగ ట్రెండ్ చేశారు. దీంతో.. ఈ నెగటివ్ ప్రభావం సినిమా కలెక్షన్లపై పడుతుందని ఫ్యాన్స్ సైతం ఆందోళన వ్యక్తం చేశారు. కానీ.. తాజాగా సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్ వెలువడటంతో ఫ్యాన్స్ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. సినిమాకు ప్రీమియర్ షోల ద్వారానే రూ.30 కోట్లు వచ్చాయంటూ పవన్ స్వయంగా వెల్లడించారు.
ఇక ఫస్ట్ డే కలెక్షన్స్ రూ.40 కోట్లకు పైగా వసూలు చేసినట్లు సినిమా వర్గాలు వివరించాయి. అలా.. ప్రీమియర్స్, ఫస్ట్ డే కలెక్షన్లను కలిపి ఏకంగా పవన్ కళ్యాణ్ రూ.70 కోట్లకు పైగా వసూళ్లను కొల్లగొట్టినట్లు సమాచారం. ఇది పవన్ కెరీర్‌లోనే ఆల్ టైం రికార్డ్ కావడంతో.. పవన అభిమానుల ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. ఒక్కోసారి నెగటివ్ టాక్.. నెగిటివ్ రివ్యూల వల్ల కూడా చాలా మంచి జరుగుతుందని.. బాయ్‌కాట్ ట్రెండ్ సినిమాకు బాగా కలిసొచ్చిందంటూ అభిమానులు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.