టాలీవుడ్: 2025 ఫస్టాఫ్ రిపోర్ట్.. అన్ని ఫేక్ పోస్టర్లే.. ఇలానే ఉంటే నిర్మాతలకు తిప్పలు తప్పవ్..!

2025 ఫస్ట్ హాఫ్ అప్పుడే ముగిసిపోయింది. చూస్తూ చూస్తుండగానే ఆరు నెలలు గడిచిపోయాయి. ఇక బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ ఆరు నెలల్లో టాలీవుడ్‌కు అసలు సరైన సక్సెస్ లు నమోదు కాలేదు అనడంలో అతిశయోక్తి లేదు. సంక్రాంతితో మొదలైన సినిమాలలో.. సంక్రాంతికి వస్తున్నాం, డాకు మహారాజ్ సినిమాలు మాత్రమే సక్సెస్ సాధించాయి. తర్వాత రిలీజ్ అయిన ఎన్నో సినిమాలు ఆడియన్స్‌ను తీవ్ర నిరాశకు గురిచేశాయి. ఇక ఫిబ్రవరిలో తండేల్, జూన్ లో కుబేర మాత్రమే ఆడియన్స్ ను మెప్పించాయి. ఈ క్రమంలోని ఏడాది ఫస్ట్ ఆఫ్ లో విజయాలు తక్కువగా ఉండడంతో.. టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర టెన్షన్ మొదలైంది. టాలీవుడ్ సినిమాలు పాన్ ఇండియా లెవెల్లో దుమ్ము రేపుతున్నాయంటూ టాలీవుడ్‌ను తెగ లేపేస్తున్న మేకర్స్.. ప్రాంతీయ భాషల్లో తర్కెక్కించిన సినిమాలతో కూడా సరైన హిట్ కొట్టలేకపోతున్నారంటూ ప్రజల్లో రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ ఏడాది ఫస్ట్ హాఫ్‌లో రిలీజ్ అయిన సినిమాలు.. వాటి రిజ్‌ల్ట్ ఒకసారి చూద్దాం.

Game Changer vs Daaku Maharaj vs Sankranti Vastunnam: Battle Begins | Game Changer vs Daaku Maharaj vs Sankranti Vastunnam: Battle Begins

సంక్రాంతితో ఏడాది ప్రారంభమైంది. టాలీవుడ్కు శుభారంభం అయింది. కొన్ని రోజులపాటు బాక్స్ ఆఫీస్ దగ్గర క‌ళ‌క‌ళలాడిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఊహించని రేంజ్ లో ఏకంగా 300 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్ల‌గొట్టింది. ప్రాంతీయ సినిమాల ఇండస్ట్రీ రికార్డ్ సృష్టించింది. ఈ సినిమా తర్వాత బాలయ్య డాకు మహారాజ్ సినిమా రూ.100 కోట్ల క్లబ్ లో చేరి హిట్గా నిలిచింది. ఇక సంక్రాంతి బరిలో వ‌చ్చిన గేమ్ చేంజెస్ సినిమా మాత్రం గోర‌ పరాజయాన్ని ఎదుర్కొంది. మొదటిరోజు 125 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టినట్లు టీం పోస్టర్ రిలీజ్ చేసినప్పటికీ.. వాస్తవంగా ఫుల్ రన్ లో కూడా ఈ రేంజ్ లో కలెక్షన్లు రాలేదని ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.

Movie Updates: గ్రాండ్‌గా తండేల్ ఈవెంట్‌.. లైలా నుంచి కొత్త పాట.. - Telugu News | Naga Chaitanya Thandel to Vishwak Sen Laila latest movie updates from film industry | TV9 Telugu

ఇక ఫిబ్రవరిలో నాగచైతన్య హీరోగా నటించిన తండ్రి సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా విమర్శకులతో సైతం ప్రశంసలు అందుకొని రూ.100 కోట్లకు పైగా గ్రాస్ వ‌శూళ్లను కొల్ల‌గొట్టి చైతూ కెరీర్‌లోనే మైల్డ్ స్టోన్ గా నిలిచింది. ఇక అదే నెలలో విశ్వక్సేన్ నుంచి రిలీజ్ అయిన లైలా, సందీప్ కిషన్ మజాకా సినిమాలు ఆడియన్స్‌ను నిరాశపరిచాయి.

Mad Square : కంట్రీని షేక్ చేస్తోన్న కోర్ట్, మ్యాడ్ స్క్వేర్ మూవీ | Court, Mad Square Movies became most lovable on Netflix

ఇక మార్చ్ వేసవి సీజన్లో టాలీవుడ్ సినిమాలు అస్సలు ఉపయోగించలేకపోయాయి. ఏదో చిన్న చిన్న సినిమాలు మాత్రమే రిలీజ్ అయ్యాయి. వాటిలో నాని నిర్మించిన‌ కోర్ట్ సినిమా హిట్టుగా నిలిచింది. ఇక కిరణ్ అబ్బవరం దిల్ రూబా, నితిన్ రాబిన్ హుడ్ పినిమాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. నార్నే నితిన్ మ్యాడ్ స్క్వేర్ యావరేజ్ గా నిలిచింది.

Arjun Son Of Vaijayanti New Movie Announcement | First Look Update | Cast & crew Update

ఏప్రిల్ గురించి చెప్పనే అవసరం లేదు. సినిమాలో రిలీజ్ అయిన ఒక్కటంటే ఒక్క హిట్ కూడా లేదు. తమన్నా నుంచి ఓదెల 2, కళ్యాణ్ రామ్ నుంచి అర్జున్ సన్నాఫ్ వైజయంతి సినిమాలు రిలీజ్ అయ్యి హిట్ టాక్ వచ్చిందంటూ.. సక్సెస్ మీట్లు పెట్టి కలెక్షన్ పోస్టర్లు రిలీజ్ చేసిన.. ట్రేడ్ వర్గాలు మాత్రం ఆ సినిమాలను ఫ్లాప్ అని వెల్లడించాయి. సిద్దు జొన్నలగడ్డ జాక్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక ప్రియదర్శి హీరోగా నటించిన సారంగపాణి జాతకం బాక్సాఫీస్ దగ్గర హిట్ అందుకోలేకపోయింది.

This fact about HIT 3's origin is sure to surprise you

మేలో నాని హీరోగా నటించిన హిట్ 3 సినిమాతో సినీప్రియులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు. 100 కోట్ల వసూళ్లను కొలగొట్టి హిట్‌ అయ్యింది. అయితే.. ఫైనల్ రిజల్ట్ మాత్రం ఒరిజినల్ కాదని టాక్ మాత్రం వినిపిస్తుంది. ఇక అదే నెలలో శ్రీ విష్ణు నుంచి సింగిల్, సమంత నుంచి శుభం సినిమాలు రిలీజ్ అయిన ఓకే అనిపించుకున్నాయి. భైరవం, షష్టిపూర్తి సినిమాలు నిరాశపరిచాయి.

Kannappa, Kuberaa Lead a Promising Weekend - TrackTollywood

జూన్ నెల మొదటి వారంలో టాలీవుడ్ పరిస్థితి అసలు బాలేదు. ఇక మూడో వారంలో శేఖర్ కమ్ముల డైరెక్షన్‌లో తెర‌కెక్కిన కుబేర సినిమా ఆడియన్స్ లో విపరీతమైన పాజిటివిటీని దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాకు రూ.120 కోట్లకు పైగా గ్రాస్ వ‌సూళ్లు దక్కాయి. ఈ సినిమా తర్వాత.. నెలాఖరుకు వచ్చిన విష్ణు కన్నప్ప సినిమా ప్రస్తుతం జోరు కొనసాగిస్తోంది. అత్యంత భారీ బడ్జెట్లో రూపొందించిన మైథాలజికల్ మూవీ ఓపెనింగ్స్‌తోనే మంచి కలెక్షన్లు కొల్లగొట్టడం సినిమాకు మరింత ప్లస్ అయింది. వచ్చే శుక్రవారం వరకు కన్నప్ప హవా థియేటర్లో కొనసాగుతూనే ఉంటుంది. సినిమా కలెక్షన్లు ఎలా ఉంటాయో చూడాలి. ఇక ఇదే నెలలో రిలీజ్ అయిన 8 వసంతాలు సినిమా ఆడియన్స‌లో హైప్ క్రియేట్ చేసిన సక్సెస్ మాత్రం రాబట్టలేకపోయింది.

8 Vasantalu (2025) - IMDb

అలా టాలీవుడ్ 2025 ఫస్ట్ ఆఫ్ సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో మొదలయ్య కన్నప్ప ముగిసింది. సక్సెస్ రేట్ దారుణంగా ఉండడమే కాదు.. ఈ గ్యాప్లో మేకర్స్ హిట్ నిర్వచనాన్ని మార్చేసే డిజాస్టర్ సినిమాలకు సైతం భారీ కలెక్షన్లు వచ్చినట్లు పోస్టర్లు ముద్ర వేసేసుకున్నారు. ఇక 2025 ద్వితీయ అద్దంలోనైనా టాలీవుడ్ కలకలలాడుతుందేమో వేచి చూడాలి. సెకెండ్ హాఫ్‌లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్‌కు సిద్ధమవుతున్నాయి. దసరా, క్రిస్మస్ సీజన్ లో అయితే పాన్ ఇండియన్ సినిమాలు ఉన్నాయి. వాటిలో కొన్ని సరైన సక్సెస్ అందుకున్నా.. టాలీవుడ్కు పూర్వ వైభవం వస్తుంది. మరి ఈ సంవత్సరం సెకండ్ హాఫ్ ఎలా ఉంటుందో చూడాలి.