పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు.. జ్యోతి కృష్ డైరెక్షన్ సంగతి తెలిసిందే. అయితే.. క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో ప్రారంభమైన ఈ సినిమాలో దర్శకుడు ఎందుకు మారాడు.. అనే సందేహాలు అందరిలోను మొదలయ్యాయి. ఇక పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్ల సినిమా ప్రారంభించే ఐదేళ్లయిన సినిమా షూట్ కు సరైన సమయం కేటాయించకుండా రాజకీయంగా పార్టీని నడిపేందుకు అవసరమైన డబ్బుల కోసం రీమేక్లు చేస్తూ వీరమలను పక్కన పెట్టేసాడు. ఈ క్రమంలోనే షూటింగ్ అంతకంతకు ఆలస్యం అవుతు వచ్చింది. దీంతో క్రిష్ సినిమా నుంచి తప్పుకోవడం జ్యోతి కృష్ణ డైరెక్టర్ గా మారి మిగిలిన పనిని పూర్తి చేయడం తెలిసిందే. 2020 జనవరిలో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చిన వీరమల్లు.. జూలై 24, 2025లో గ్రాండ్ గా రిలీజ్ చేశారు.
మూవీ రిలీజ్ సందర్భంగా ఇంస్టాగ్రామ్ ద్వారా డైరెక్టర్ క్రిష్ రియాక్ట్ అయ్యాడు. వీరమల్లు ఈ ప్రపంచంలో అడుగుపెడుతున్నాడు. నిశ్శబ్దంగా కాదు.. ఓ బలమైన కారణంతో.. సినిమాలోని ప్రతి ఫ్రేమ్ వెనక చాలా బరువైన చరిత్ర.. అంతకు మించిన కష్టం ఉందని క్రిష్ రాసుకోచ్చాడు. ప్రయాణం కేవలం ఇద్దరి గొప్ప దిగ్గజాల వల్లే సాధ్యమైందని.. వాళ్ళు సినిమా రంగంలోనే కాదు.. అందరిలో స్ఫూర్తినింపడంలోనూ దిగ్గజాలే అంటూ పవన్, ఏ.ఏం. రత్నంలపై ప్రసంసలు కురిపించాడు. ఇక నా ఊహల్లో జరిగే పోరాటాల నుంచి ఈ కథ పుట్టింది. దర్శకుడుగా కాదు.. మనం మర్చిపోయిన మన చరిత్రను తిరిగి ప్రేక్షకులకు పరిచయం చేసే అన్వేషకుడిగా ఎన్నో విషయాలను సేకరించా. ఓ సరికొత్త ప్రపంచాన్ని నిర్మించడానికి అవకాశానంగా దీన్ని వాడుకున్నా. అన్నింటికంటే ముఖ్యంగా మనం మర్చిపోయిన చరిత్ర అందరికీ తెలియజేయాలని, జ్ఞానోదయం కలిగించాలని ఆలోచనతో సినిమా కోసం కష్టపడ్డా.. ఇన్నేళ్ల తర్వాత ఆ అద్భుతం స్క్రీన్ పై ఆవిష్కరించబడుతుంది.
ప్రేమ, కసితో క్రిష్ జాగర్లమూడి అంటూ షేర్ చేసుకున్నాడు. అయితే క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకోవడానికి కారణం హీరోకు ఆయనకు మధ్యన మనస్పర్ధలు అంటూ మధ్యలో ఎన్నో వార్తలు వైరల్ అయ్యాయి.. ఇక తాజాగా క్రిష్ చేసిన ఈ పోస్ట్‌తో అవని అవాస్తవాలని తేలిపోయింది. పవన్ ఎమ్మెల్యేగా గెలవడానికి ముందు మూడు సినిమాలు ప్రారంభించాడు. మూడు సినిమాలు కూడా నిర్మాణ దశలో ఆగిపోయాయి. ఇక ఉస్తాబాద్ సింగ్ ఆగిపోవడంతో హరీష్ శంకర్ రవితేజతో మిస్టర్ బచ్చన్ మూవీ చేశాడు. అలానే వీరమల్లు సినిమా కోసం ఐదేళ్లు కష్టపడిన క్రిష్.. ఈ సినిమా ఇక సర్టిఫై కి వచ్చే అవకాశం లేదని అనుష్క శెట్టితో ఘాట్టి మూవీకి ఫిక్స్ అయ్యాడు. ఏడాదిగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా సెప్టెంబర్ లో రిలీజ్ కానుంది. ఇక సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నప్పుడు విరమల్లు సినిమా కోసం పవన్ డేట్స్ కేటాయించాడు. అప్పటికే సెట్స్‌పై ఉన్న ఘాటిని వదిలి వీరమల్లును మళ్ళీ పట్టుకోవడం కష్టమని భావించిన్న క్రిష్ ఈ సినిమా నుంచి తప్పుకున్నాడు.