టాలీవుడ్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. జ్యోతి కృష్ణ డైరెక్షన్లో నటించిన లెటెస్ట్ మూవీ హరిహర వీరమల్లు. ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. మరో నాలుగు రోజుల్లో ఈ సినిమా గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయింది. ఈ క్రమంలోనే ప్రమోషన్స్‌లో సైతం పాల్గొని సందడి చేస్తున్నాడు. పవన్ తాజాగా సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకున్నాడు. ఇక పవన్ లైనప్‌లో ఈ సినిమా తర్వాత మరో రెండు సినిమాలు ఉండనున్నాయి.
ఇప్పటికే.. సుజిత్ డైరెక్షన్‌లో పవన్ నటిస్తున్న ఓజీ సినిమా తుది దశకు చేరుకున్న క్రమంలో.. సినిమా రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. మరో ప్రాజెక్ట్ ఉస్తాద్ భగత్ సింగ్. హరీష్ శంకర్ డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమా దాదాపు ఏడాదిన్నరగా సెట్స్ పైనే కొనసాగుతుంది. పవన్ కళ్యాణ్ రాజకీయాలతో బిజీగా ఉండడంతో సినిమా షూట్స్‌లో పాల్గొనలేకపోయాడు అన్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా శ్రీ లీల మెరవనుంది.
ప్రస్తుతం సినిమా షూట్ సర్వే గంగా జరుగుతున్న క్రమంలో.. సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెటింట వైరల్‌గా మారుతుంది. ఈ సినిమాల్లో స్టార్ డైరెక్టర్, నటుడు రవికుమార్ కీలకపాత్రలో మెరవనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో వార్తలు తెగ చెక్కర్లు కొడుతున్నాయి. అసతోష్ రానా, గౌతమి ,నాగ మహేష్, టెంపర్ వంశీ, కేజిఎఫ్ ఫేమ్ అవినాష్ తదితరులు కీలకపాత్రలో మెరవనున్న ఈ సినిమాకు డిఎస్పీ మ్యూజిక్ అందిస్తున్నాడు. నవీన్ యార్నేని, రవిశంకర్లు.. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్‌పై ప్రతిష్టాత్మకంగా ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు.