మా పెళ్లి అంత ఈజీగా కాలేదు.. చాలా ట్విస్ట్‌లు.. దిల్ రాజు వైఫ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్‌గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న దిల్‌రాజు.. రెండో భార్య తేజస్వినికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదటి భార్య అనిత చనిపోయిన తర్వాత తేజస్వినిని ప్రేమించి రెండవ వివాహం చేసుకున్నాడు దిల్ రాజు. అప్పట్లో వీళ్ళ పెళ్లిపై సోషల్ మీడియాలో చాలా డిస్కషన్లు జరిగాయి. కరోనా టైంలో ఇరు కుటుంబాల సమక్షంలో చాలా సింపుల్గా వివాహం చేసుకున్న ఈ జంట.. ఎంతో అన్యోన్యంగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న దిల్ రాజు భార్య.. తేజస్విని త‌న‌ ప్రేమ, పెళ్లి గురించి ఇంట్ర‌స్టింగ్ విషయాలను షేర్ చేసుకుంది. ఆమె మాట్లాడుతూ.. రాజుగారితో పెళ్లి అంత సులువుగా జరిగిపోలేదని.. చాలానే కష్టపడాల్సి వచ్చిందని.. ఆమె వివరించింది.

మొదట్లో ఆయన ఎవరో కూడా నాకు తెలియదు. ఆయన గురించి తెలియనప్పుడు ఆయన ఒక డైరెక్టర్ అనుకున్నా. కానీ.. తర్వాత గూగుల్ చేస్తే ఆయన ప్రొడ్యూసర్ అని తెలిసింది. ముందు ఆయనకు ఫ్యామిలీ ఉందని తెలిసి వెనకడుగువేశా. తర్వాత కొంతకాలానికి విధి మమ్మల్ని కలిపిందంటూ తేజస్విని చెప్పుకొచ్చింది. అంతేకాదు.. దేవుడు నేను కోరుకున్నవన్నీ ఇచ్చాడని.. ఇంకా చెప్పాలంటే కోరుకున్న దాని కంటే ఎక్కువే ఇచ్చాడని.. నేను చాలా అదృష్టవంతురాలిన‌ని తేజస్విని చెప్పుకొచ్చింది. నేను దిల్ రాజు గారిని ప్రేమించానని పెళ్లి చేసుకుంటానని విషయం ఇంట్లో చెప్పడానికి ఎంతగానో ఆలోచించా. ఆ టైంలో ముందు ఎవరిని కన్విన్స్ చేయాలని దిల్ రాజు నన్ను అడిగారు.

Dilraju Wife Tejaswini Biography: Age, Career, Family, Networth, Kids -  Cinema Manishi

నేను నా పెద్ద మామ గురించి చెప్పానని తేజస్వి వివరించింది. నా కుటుంబంలో మా పెద్దమామ చాలా స్ట్రిక్ట్. ఆయన్ని ఒప్పిస్తే అందరినీ ఈజీగా కన్విన్స్ చేసేయొచ్చు అనుకున్న. తర్వాత మా పిన్నికి చెప్పాలనుకున్నా. మా పిన్ని నన్ను పెంచింది అంటూ తేజస్విని వివరించింది. విషయం తెలుసాక వాళ్లు ఒప్పుకోలేదని.. తన పెద్ద మామ ఫ్యామిలీ మొత్తని క‌న్విన్స్ చేసి మా వివాహం చేశిడ‌ని తేజస్విని చెప్పుకొచ్చింది. ఇప్పుడు దిల్ రాజు, తేజస్వినికి.. బాబు కూడా ఉన్న సంగతి తెలిసిందే. తేజస్విని తమ పెళ్లి గురించి వాళ్ళ మ్యారేజ్ లో ఉన్న ట్విస్ట్‌ల‌ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.