ఇండస్ట్రీలో అడుగుపెట్టిన తర్వాత ఎప్పుడు ఎవరి లైఫ్ ఎలా చేంజ్ అవుతుందో.. ఎవరి అదృష్టం ఎలా మారుతుందో ఎవరు చెప్పలేరు. ఒకప్పుడు స్టార్ హీరో, హీరోయిన్లుగా రాణించిన వాళ్ళు సైతం తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా, తల్లి తండ్రీ, విలన్ పాత్రల్లో నటిస్తున్న సందర్భాలు చాలా ఉన్నాయి. అలా ఏ పాత్ర ఇచ్చిన దానికి తగ్గట్టు నటించి మెప్పించి ఇండస్ట్రీలో రాణిస్తున్న వారు చాలామంది ఉన్నారు. కాగా.. ఓకే నటి మొదట హీరోయిన్‌గా చేసి తల్లిగా, చెల్లిగా, అక్కగా, లవర్ గా కూడా నటించిన సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం మనం మాట్లాడుకోబోయే స్టార్ బ్యూటీ కూడా అదే కోవకు చెందుతుంది.
ఆమె గతంలో మహేష్ బాబు, ప్రభాస్లతో ఐటెం సాంగ్స్ చేసి.. తర్వాత తల్లిగా నటించి ఆడియన్స్‌ను మెప్పించింది. ఇంతకీ ఆ ముద్దుగుమ్మ ఎవరో చెప్పలేదు కదా.. రమ్యకృష్ణ. టాలీవుడ్ ఆడియన్స్ లో రమ్యకృష్ణ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో నీలాంబరి రోల్ తో బాక్స్ ఆఫీస్‌ను షేక్ చేసిన ఈ అమ్మడు పాన్ ఇండియన్ బాహుబలి తో శివగామిగా ఆకట్టుకుంది. ఇప్పటికే ఎన్నో సినిమాల్లో ప్రధాన పాత్రలో మెరిసిన రమ్యకృష్ణ.. గతంలో మహేష్ బాబు, ప్రభాస్లతో ఐటెం సాంగ్ లో నటించింది. రెబల్ స్టార్ ప్రభాస్.. అడవి రాముడు సినిమాల్లో రమ్యకృష్ణ జంటను విడదీసే అనే ఒక ఐటమ్ సాంగ్ లో మెరిసిన సంగతి తెలిసిందే. ఈ పాట అప్పట్లో హైలైట్. అయితే.. తర్వాత బాహుబలి సినిమాతో రమ్యకృష్ణ ప్రభాస్ తల్లిగా నటించి ఆకట్టుకుంది.
ఇలాంటి విచిత్రమైన కాంబినేషనే మహేష్ బాబుతో రిపీట్ అయింది. మహేష్ బాబు నాని సినిమాలో మార్కండేయ అనే స్పెషల్ సాంగ్ లో మెరిసిన రమ్యకృష్ణ.. ఈ సాంగ్తో మంచి క్రేజ్ దక్కించుకుంది. ఇక చాలా కాలం గ్యాప్ తర్వాత గుంటూరు కారం సినిమాతో మహేష్ బాబు తల్లి పాత్రలో నటించి ఆకట్టుకుంది. అమ్మడి నటనకు మంచి మార్కులే పడ్డా.. సినిమా మాత్రం ఊహించిన రేంజ్ సక్సెస్ అందుకోలేదు.