ప్రముఖ పొలిటిషన్, బిజినెస్ మాన్.. గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు కిరిటి హీరోగా జూనియర్ సినిమాతో ఎంట్రీ ఇవ్వనున్నాడు. శ్రీ లీల హీరోయిన్గా, జెనీలియా, రావు రమేష్ కీలక పాత్రలో మెరువనున్న ఈ సినిమాకు కన్నడ దర్శకుడు రాధాకృష్ణ దర్శకత్వం వహించారు. వారాహి చలనచిత్రం బ్యానర్ పై రజిని కొర్రపాటి ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న ఈ సినిమాకు.. డిఎస్పీ మ్యూజిక్ డైరెక్టర్గా వ్యవహరించారు. బాహుబలి, ఆర్‌ఆర్ఆర్ లాంటి సినిమాల సినిమాటోగ్రాఫర్ గా వ్యవహరించిన కే.కే. సెంథిల్ కుమార్.. ఈ సినిమా కోసం పనిచేయడం హైలైట్. ఇక.. తాజాగా మూవీ షూట్‌ను పూర్తిచేసుకుని.. ప్రమోషనల్ కంటెంట్‌తో ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమా జులై 18న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఈ క్రమంలోనే జూనియర్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కిరిటి ఇంటర్వ్యూలో సందడి చేశాడు.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఒక టాలీవుడ్ స్టార్ హీరో ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చాటి చెప్పాడు. అంతేకాదు.. కన్నడ దివంగత నటుడు రాజ్ కుమార్ స్ఫూర్తితో తను ఇండస్ట్రీ లోకి వచ్చాను అంటూ వివరించాడు. వేలకోట్ల అధిపతి జనార్దన్ రెడ్డి ఏకైక తనయుడుగా కిరీటి అనుకుంటే.. ఎన్నో వ్యాపారాలు చేస్తూ లగ్సరీగా బ్రతకొచ్చు. కానీ ఎంత కష్టమైనా సినిమాపై మక్కువతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ఈ క్రమంలోనే ఆయన ఇంటర్వ్యూలో మాట్లాడిన తీరు నెటిజన్లను ఆకట్టుకుంది. కోట్ల ఆస్తులున్న కాస్త అయినా గర్వము లేదని.. అంతేకాదు.. తన టాలెంట్ ఏంటో ట్రైలర్ చూస్తే అర్థమయిపోయిందంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీ లీలకే పోటీగా తన డ్యాన్స్‌తో ఆకట్టుకున్న కిరీటి.. ఎంతోమందిని మెప్పించాడు. రీల్స్ కూడా తెగ వైరల్ గా మారాయి. ఇక తాజాగా అయినా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ జూనియర్ ఎన్టీఆర్ పై తనకున్న అభిమానాన్ని చెప్పుకొచ్చాడు.
జూనియర్ ఎన్టీఆర్ అంటే నాకు చాలా ఇష్టమని.. నా సినిమాలో ఫస్ట్ సాంగ్ వచ్చి మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. శ్రీలీలతో సమానంగా స్టెప్పులు వేశానంటూ ప్రశంసించారు. అయితే ఎన్టీఆర్ అభిమానిగా ఈ సాంగ్ విజయాన్ని నేను ఆయనకు ట్రిబ్యూట్ చేస్తున్నానంటూ కిరిటి చెప్పుకొచ్చాడు. ఎన్టీఆర్ డ్యాన్స్, నటన, వ్యక్తిత్వం నాకు చాలా ఇష్టమని.. ఆయనను నా జీవితంలో ఒక్కసారి అయినా కలిసే ఛాన్స్ వస్తే ఎంతగానో సంతోషిస్తా.. నా సినిమా వేడుకకు ఆయన స్పెషల్ గెస్ట్ గా వస్తే మాత్రం లైఫ్ లో గుర్తుండిపోతుంది. నాకు ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా అంటే ఎంతో ఇష్టం. ఆయనను కలవడం అదృష్టంగా భావిస్తా.. అమ్మపై ప్రేమ, ఎన్టీఆర్ పై అభిమానం మాటల్లో చెప్పలేను.. అలా అని నేను ఇతర హీరోలను, అభిమానులను తక్కువ చేయడం లేదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క హీరో అంటే ఇష్టం ఉంటుంది. నాకు ఎన్టీఆర్ అంటే అభిమానం అంటూ కిరిటి వివరించాడు. ప్రస్తుతం కిరీటి కామెంట్స్ నెటింటా వైరల్ గా మారుతున్నాయి.