హీరోయిన్ రుహణి శర్మకు సోషల్ మీడియాలో ఎలాంటి క్రేజ్ పాపులారిటీ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు తన గ్రామర్‌తో కుర్రాళను కవ్వించే ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. అమ్మడి లేటెస్ట్ గ్లామర్ పిక్స్ కుర్ర కారుకు చెమటలు పట్టిస్తున్నాయి. ఇక ఫ్యాన్స్ ఈ పిక్స్ను సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తూ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా రుహణి ధరించిన టాప్ కుర్రళకు హీట్ పుట్టిస్తుంది. గుండెల్లో గుబులు రేపుతుంది. అదృష్టం వర్కౌట్‌కాక రుహణి శర్మ స్టార్ హీరోయిన్ కాలేదు కానీ.. తన అందం, అభినయం, గ్లామర్ నెక్స్ట్ లెవెల్ అంటూ అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలోనే తెలుగులో పలు సినిమాల్లో మెరిసిన రుహణి.. నార్త్ ఇండస్ట్రీలో రాణించాలని ప్రయత్నించినా రేస్ లో వెనుకపడిపోయింది. హిమాచల్ ప్రదేశ్‌లో పుట్టిన ఈ ముద్దుగుమ్మ.. మోడలింగ్‌తో కెరీర్ ప్రారంభించింది.
2017 లో సిల్వర్ స్క్రీన్ పై ఎంట్రీ ఇచ్చింది. కడైసి బెంచ్ కార్తీ అనే సినిమాతో ఆడియన్స్ కు పరిచయమైంది. రెండో సినిమా చిలాసౌ. శుషాంత్ హీరోగా నటించిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌ను దక్కించుకుంది. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్‌లో రూపొందిన ఈ సినిమా నేషనల్ అవార్డ్‌ను దక్కించుకుంది. ఉత్తమ స్క్రీన్ ప్లే విభాగంలో సినిమాకు అవార్డు దక్కింది. ఛీలాసౌ లో రుహణి నటన ఆడియన్స్‌తో ప్రశంసలు దక్కించుకుంది. ఈ సినిమా తర్వాత అమ్మడు చేతినిండా సినిమాలతో బిజీ అయిపోతుందని.. తిరుగులేని క్రేజ్ దక్కించుకుంటుందని అంతా భావించారు. కానీ.. ఊహించిన రేంజ్ లో అమ్మడికి అవకాశాలు దక్కలేదు. స్టార్ హీరోల పక్కన ఛాన్స్ కొట్టేస్తుందని భావించినా.. నాని నిర్మాతగా, విశ్వక్‌సేన్ హీరోగా నటించిన హిట్ సినిమాలో అమ్మడికి అవకాశం దక్కింది. సస్పెన్స్ క్రైమ్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా సక్సెస్ అందుకున్నా.. అమ్మడి పాత్రకు పెద్దగా ఇంపార్టెన్స్ లేకపోవడంతో కెరీర్ కు పెద్దగా వర్కౌట్ కాలేదు. రుహణి శర్మకు ఆఫర్స్ వస్తున్నా.. అవన్నీ చిన్న సినిమాలు కావడం ఊహించిన రేంజ్‌లో సక్సెస్ అందుకోకపోవడంతో రేసులో వెనుకబడిపోయింది.
బ్రేక్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్న ఈ అమ్మడు బాలీవుడ్ లోనూ తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఆగ్రా సినిమాల్లో రుహాని శర్మ ఎలాంటి సన్నివేశాలు నటించిందో తెలిసిందే. ఇంటిమేట్ సీన్స్ తో సోషల్ మీడియాను షేక్ చేసింది. ఈ అమ్మడు.. ప్రైవేట్ వీడియోలు అంటూ పుకార్లు కూడా వైరల్ అయ్యాయి. ఈ వార్తలపై అసహనం వ్యక్తం చేసిన ఆమె.. ఇవి ఎంతగానో నన్ను బాధిస్తున్నాయి అంటూ వాపోయింది. అగ్ర మూవీ ప్రఖ్యాత కెన్స్ ఫెస్టివల్‌లో ప్రదర్శించడం గమనార్హం. గత ఏడాది రుహణి శర్మ దాదాపు 5 సినిమాల్లో మెరవగా.. ప్రస్తుతం తమిళ్లో మస్కా టైటిల్ తో ఓ సినిమాలో కనిపించనుంది. ఇక సోషల్ మీడియాలో ఫాన్స్ కు అందుబాటులో ఉంటున్న ఈ అమ్మడు వెకేషన్ ఫోటోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. స్లీవ్ లెస్ టాప్ స్కర్ట్ ధరించి రుహణి గ్లామరస్ మెరుపులు మెరిపించింది. అయితే.. అమ్మడి టాప్ హైలెట్స్ అన్ని తెలిసింది. కొంతమంది నెటిజన్స్ మాత్రం ఆమె ఫ్యాషన్‌పై మండిపడుతున్నారు. ఇది ఎక్కడ దిక్కుమాలిన ఫ్యాషన్ అంటూ.. అసలు అది కూడా వేసుకోకపోతే ఏమవుతుంది అంటూ.. ఫ్యాషన్ పేరుతో ఏదైనా చేసేస్తారా అంటూ.. మండిపడుతున్నారు నెటిజన్స్.