కాస్టింగ్ కౌచ్ ఆరోపణలు చూసి వాళ్లంతా నవ్వుకున్నా.. విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్

సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చాక మనకి ఇష్టమున్న లేకున్నా కొన్ని కొన్నివిషయాలను ఓర్చుకోక తప్పదు. ఈ క్ర‌మంలోనే తనపై వచ్చిన కాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై కోలీవుడ్ హీరో విజయ్ సేతుపతి తాజాగా స్పందించారు. తనపై చేసిన ఆరోపణలను చూసి చాలా మంది నవ్వుకుంటున్నారని.. కానీ తన కుటుంబం ఎంతగానో బాధ పడుతుందని వివ‌రించాడు. ఇక నాపై ఈ ఆరోపణలు చేసిన నటిపై తన టీం సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందన్నారు. నేను సినీ ఇండస్ట్రీలోకి వచ్చి.. న‌న్ను ఎన్నో ఏళ్లుగా చూస్తున్న వారంతా ఆమె ఆరోపణలు చూసి నవ్వుకున్నారు.

Vijay Sethupathi Breaks Silence On Casting Couch | Vijay Sethupathi Breaks  Silence On Casting Couch

నేనేంటో నాకు తెలుసు. ఈ రకమైన తప్పుడు ఆరోపణలు నన్ను బాధించవు. కానీ ఇప్పుడు నా కుటుంబం, నా స్నేహితులు సోషల్ మీడియాలో నాపై వచ్చిన ఆరోపణలు చూసి షాక్ అవుతున్నారు. ఇవన్నీ నిజాలు కాదు ఆమె ఫేమస్ అవడం కోసమే కావాలని ఇలా చేసింది. కొంతమంది ఫేమస్ అవడం కోసం ఎదుటి వాళ్ళని ఎంత ఇబ్బంది పెట్టడానికైనా చూస్తారు. కొన్ని నిమిషాలు, కొన్ని గంటలు మాత్రమే వాళ్ళు హైలెట్ అవుతారు. పాపం ఎంజాయ్ చేయనివ్వండని ఫ్యామిలీతో చెప్పా. మేము ఆమెపై సైబర్ క్రైమ్ లో ఫిర్యాదు చేశాం. ఏడు సంవత్సరాలుగా నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని.. దేనికి భయపడకుండా రాణిస్తున్నా.

I am like a kid whenever I stand in front of the camera: Vijay Sethupathi |  Tamil News - The Indian Express

ఇలాంటివి ఎప్పటికీ నన్ను బాధించలేవు అని విజయ్ సేతుపతి స్ట్రాంగ్ కామెంట్స్ చేశాడు. కాగా.. కోలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ బాగా ఉందని దీని వల్ల తన స్నేహితురాలు ఎంతో ఇబ్బంది పడిందని రమ్య అనే ఓ మహిళ ఎక్స్ లో పోస్ట్ పెట్టింది. విజయ్ సేతుపతి కూడా ఆమెను ఇబ్బంది పెట్టారని ఆరోపించింది. తన స్నేహితురాలు మానసికంగా దెబ్బతిందని తన పోస్టులోరాసుకొచ్చింది. అయితే ఆమె తన పోస్ట్‌ను కొన్ని గంటల్లో తొలగించినా.. అప్పటికే ఆ పోస్ట్ వైరల్ అవ్వ‌డంతో విజయ్‌ ఫ్యాన్స్ ఆమెపై విరుచుకుపడ్డారు. .ఆమె చేసిన విమర్శలు నిజమే అయితే పోస్ట్ ఎందుకు డిలీట్ చేశారని ప్రశ్నించారు. దీంతో ఆ మహిళా మరో పోస్ట్ పెట్టి తను కోపంలో ఏం చేశాను తెలియక చేశానని.. అది వైరల్ అవుతుందని ఊహించలేదని తెలిపింది. తన స్నేహితురాలి గోప్యత కోసం పోస్ట్ డిలీట్ చేసినట్లు చెప్పుకొచ్చింది.