ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో స్టార్ హీరోలు, హీరోయిన్లకు సంబంధించి.. సినిమాలకు సంబంధించి ఏవో ఒక రూమర్లు ఎప్పటికప్పుడు వైరల్ అవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి సంబంధించిన వార్తలు నెటింట వైరల్ అయ్యినా.. వాటిలో వాస్తవం ఉన్నా జనం వాటిని నమ్మలేని పరిస్థితి నెలకొంది. ఇలాంటి క్రమంలో.. తాజాగా సోషల్ మీడియాలో ఓ న్యూస్.. తెగ వైరల్ గా మారుతుంది. అదేంటంటే.. ఇటీవల బాలీవుడ్‌లో నితీష్ థివారి డైరెక్షన్‌లో రణ్‌బీర్ కపూర్ రాముడిగా నటించిన రామాయణం మూవీ.. రిలీజ్‌కు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.
ఇప్పటికే షూట్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ.. 2026 దీపావళికి గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ కానుంది. కాగా.. మొదట ఈ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌కు బదులుగా రాముడి పాత్రలో సూపర్ స్టార్ మహేష్ బాబును అనుకున్నారట. మహేష్ కూడా ఈ సినిమా చేసేందుకు ఆసక్తి చూపించినా.. అదే టైంలో ఆయనకు రాజమౌళి సినిమా రావడం.. దానిని అప్పటికే అంగీకరించడంతో.. రామాయణం సినిమాకు కాల్ షీట్లు అందించలేని పరిస్థితి నెలకొంది. దీంతో.. నితీష్ ఆఫర్‌ను మహేష్ బాబు సున్నితంగా రిజెక్ట్ చేశారని సమాచారం.
ఇందులో వాస్తవం ఎంతో తెలియదు గాని.. ప్రస్తుతం ఇదే న్యూస్ నెటింట వైరల్‌గా మారడంతో.. మహేష్ అభిమానులు తెగ ఫీల్ అయిపోతున్నారు. అనవసరంగా రాముడు పాత్రను మహేష్ వదులుకున్నారని.. మహేష్ రాముడిగా చూడచక్కగా కనిపించేవాడని.. అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. రొటీన్ మూవీ రోల్స్ కాకుండా ఆయన స్థాయిని పెంచే రాముడి లాంటి మంచి పాత్రను అనవసరంగా ఆయన మిస్ చేసుకున్నాడని.. అలాంటి గొప్ప పాత్రను రాజమౌళి కోసం ఎందుకు త్యాగం చేశాడంటూ.. రకరకాల అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.