టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి.. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. 7 పదుల వయసులోనూ ఇప్పటికీ యంగ్ హీరోలకు గట్టి పోటీ ఇస్తున్న చిరు.. ప్రస్తుతం అనీల్ రావిపూడి డైరెక్షన్లో ఓ సినిమాలో నటిస్తున్నారు. మెగా 157 రన్నింగ్ టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూట్.. సర్వే గంగా జరుగుతుంది. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న.. అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సినిమా కావడంతో మరింత ఆసక్తి నెలకొంది. ఇక ఈ ఏడది సంక్రాంతి బరిలో అనిల్ రావిపూడి నుంచి వచ్చిన వెంకటేష్ మూవీ.. సంక్రాంతికి వస్తున్నాం. ఈ సినిమా రిలీజై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఏకంగా రూ.300 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టి వెంకీ కెరీర్లోనే హైయెస్ట్ కలెక్షన్లు కొల్లగొట్టిన సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. దీంతో అనిల్.. చిరుతో రూపొందించనున్న సినిమాపై ఆడియన్స్‌లో విపరీతమైన హైప్ పెరిగింది.
ఇక.. ఉగాది సందర్భంగా పూజా కార్యక్రమాలతో ప్రారంభమైన మెగా 157.. ఇప్పటికే రెండు స్కెడ్యూలను పూర్తిచేసుకుని మూడవ షెడ్యూల్లోకి అడుగు పెట్టింది. సినిమాలో చిరంజీవి సరసన నయనతార, కేథరిన్ మెరవనున్నారు. కాగా.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనిల్.. ఈ సినిమాకు సంబంధించిన స్టోరీ మొత్తం లీక్ చేయడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. స్టోరీ వర్క్ అవుట్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ పక్క అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. అసలు మేటర్ ఏంటంటే.. చిరుతో సినిమా పై అనిల్ మాట్లాడుతూ.. ఇది ఒక భార్యాభర్తల కథ అని అందులో 70% కామెడీ ఉంటే.. 30% ఎమోషనల్ డ్రామా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. చిరంజీవి పాత్ర ఘరణ మొగుడు, గ్యాంగ్ లీడర్, చంట్టబ్బాయి తరహాలో మాస్ కమ్.. ఫన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌ను మిక్స్ చేసుకొని రూపొందిందని.. అని వర్గాల ఆడియన్స్‌ను సినిమా ఆకట్టుకునేలా స్టోరీ డిజైన్ చేశామంటూ చెప్పుకొచ్చాడు.
అంతే కాదు.. ఈ సినిమా నా కెరీర్లోనే బెస్ట్ మూవీ అవుతుందని నమ్మకం నాకు ఉంది అనిల్ వివరించాడు. ఇప్పటికే షూట్ పూర్తైన స్కెడ్యూల్స్లో చిరు పర్ఫామెన్స్ తో గూస్ బంప్స్ తెప్పించాడని వివరించాడు. ఇక ఈ మూవీలో వెంకటేష్ స్పెషల్ గెస్ట్ గా నటించబోతున్నాడు అనే వార్తలకు క్లారిటీ ఇచ్చాడు. వెంకీ గారు నటిస్తున్నారని.. ఆయన రోల్ ఒక సర్ప్రైజింగ్ ప్యాకేజ్.. కచ్చితంగా ఆయన ఎంట్రీ రోజు బ్లాస్ట్ అవుతుంది అంటూ చెప్పుకొచ్చాడు. ఆయన రోల్ ఏంటో ఇప్పుడే చెప్పేస్తే థంబ్‌నెయిల్స్‌తో కథ మొత్తం మీడియాలో రాసఏస్తారంటూ ఫన్నీ కామెంట్స్ చేశాడు. ఇక సంక్రాంతికి వస్తున్నాం బుడ్డోడు.. బుల్లిరాజు ఈ మూవీలో నటిస్తున్నాడని.. ఇందులో కంప్లీట్ డిఫరెంట్ క్యారెక్టర్ లో తను కనిపించబోతున్నాడు క్లారిటీ ఇచ్చాడు. ప్రస్తుతం అనిల్ కామెంట్స్ వైరల్ అవ్వడంతో.. ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కొట్టాలని కోరుకుంటున్నారు.