డైనమిక్ హీరో మంచి విష్ణు లేటెస్ట్ మూవీ కన్నప్ప రిలీజై పాజిటివ్ టాక్తో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. హిట్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూసిన విష్ణు ఈ సినిమాతో జాక్పాట్ కొట్టాడు. అయితే మొదట ఈ సినిమాను చేయాలని విష్ణు 2013 నుంచే ప్లానింగ్స్ మొదలుపెట్టాడట. రెబల్ స్టార్ కృష్ణంరాజు హీరోగా తెరకెక్కిన భక్త కన్నప్ప సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. స్టోరీ తో ప్రభాస్ పాన్ ఇండియన్ ప్రాజెక్ట్ గా.. కన్నప్ప రీమేక్ చేయాలని కృష్ణంరాజు భావించాడట. కానీ.. అది వర్కౌట్ కాలేదు. ఈలోగా ఇదే కథను మోహన్ బాబు.. విష్ణుతో తీయాలని ఫిక్స్ అయ్యాడు. ఆ విషయం కృష్ణంరాజుకు చెప్పగా.. ఆయన ఓకే అనడంతో మరోసారి కథపై విఫులంగా చర్చలు జరిపారు. మొత్తానికి ఎన్నో కష్టాలు, అవరోధాలు, అనుమానాలు, విమర్శల తర్వాత విష్ణు సినిమా సక్సెస్ఫుల్గా పూర్తిచేసి సిల్వర్ స్క్రీన్ పై ఆడియన్స్ను పలకరించింది.
అంతే కాదు సినిమా రిలీజ్ అయిన ఫస్ట్ పాజిటివ్ టాక్ ను దక్కించుకుంది. అయితే నిజమైన కన్నప్పను పోల్చి చూస్తే.. అందరికీ వచ్చిన డౌట్.. శివలింగం ఎందుకు ఆ రూపంలో ఉందని. కన్నప్ప సినిమాలో శివలింగ రూపు.. భక్తకన్నప్పలోని శివలింగ రూపును పోల్చి చేశారని అనుకుంటారు కాని అసలు మ్యాటర్ తెలియాలి అంటే.. కన్నప్ప కథ తెలియాలి. కన్నప్ప అసలు పేరు తిన్నడు. బోయవాడు.. బోయ రాజు కొడుకు శ్రీకాళహస్తి ప్రాంతాల్లో అడవుల్లో ఉండే తిన్నడు. శివుడి పై మహా భక్తితో తన కన్నుని అర్పించడంతో.. కన్నప్పగా మారాడు. ఇక అసలు మ్యాటర్ ఏంటంటే.. కన్నప్ప శివలింగం రూపం ఎందుకు అలా ఉంది.. ఇంతకీ ఈ వాయిలింగం మిగతా శివలింగాలలా ఉండకుండా ఎందుకు వ్యత్యాసంగా ఉంటుంది.
అసలు ఈ వాయులింగం గొప్పతనం ఏంటి ఒకసారి చూద్దాం. పంచభూత లింగాలలో వాయులింగం నాలుగోవది. ఈ వాయు లింగం వాయుదేవుడికి.. మహాశివుడు బహుమతిగా ఇచ్చిన వరం. శ్రీకాళహస్తిలో వాయుదేవుడి పేరు పై వాయు లింగముగా వెళ్తాడు. వాయువు అంటే గాలి. గాలికి ఎలాంటి ఆకారం ఉండదు. ఎటైనా ప్రయాణించగలదు. ఎలాంటి పరిమితులు ఉండవని తెలిసిందే. ఈ క్రమంలోనే వాయులింగం నిలువుగా ఉంటుంది. అంటే.. ప్రాణశక్తి పైకి వెళ్తుందని అర్థం. దీనికి తగ్గట్టుగానే వాయులింగం వాయుతత్వ రూపానికి నిదర్శనంగా గర్భగుడిలో కుడివైపున ఉన్న రెండు దీపాలు ఎప్పుడు రెపరెపలాడుతూనే ఉంటాయని అంటారు.
ఇక.. ఈ వాయు లింగానికి సేవలు చేస్తూ అక్కడే ప్రాణాలు వదిలిన ఏనుగు, సర్పం, సాలీడు పేర్ల మీదగా శ్రీ కాళహస్తి అనే పేరుతో వాయు లింగేశ్వర స్వామి గుడికి ప్రాచుర్యత వచ్చింది. అంతేకాదు.. ఈ లింగంలో మరో గొప్ప విషయం అక్కడే ప్రాణాలు విడిచిన ఏనుగు దంతాలు విగ్రహం కింద భాగంలో.. సర్పం మధ్య భాగంలో.. అలాగే సాలిడ్ చిహ్నాలు వెనుక భాగంలో ఉంటాయని అంటారు. అంతేకాదు.. ఇది స్వయంభు ఈశ్వరుడిగా వెలసిన లింగం. ఇక ఈ విగ్రహాన్ని ఎవ్వరూ ఎప్పుడు చేతులతో తాకరు. పూజారులు సైతం విగ్రహానికి పూజలు చేసేటప్పుడు కూడా విగ్రహాన్ని అంటుకోరు. అభిషేక ప్రియుడైన ఈశ్వరుడికి అభిషేకాలు కూడా కేవలం పీఠంపై మాత్రమే చేస్తారు. కారణం వాయువుని ఎవరు తాకలేరు కనుక ఈ నియమం ఉంది.