పవర్ స్టార్ పవనన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపి డిప్యూటీ సీఎంగా.. రాజకీయాల్లో బిజీబిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. అయినా.. ఆయన సైన్ చేసిన సినిమాలను పూర్తి చేయాలని ఫిక్స్ అయ్యాడు పవన్. ఈ క్రమంలోనే నిర్మాణంలో ఉన్న సినిమాలు పూర్తి చేస్తాడని.. తర్వాత కొత్త సినిమాలును పవన్ కళ్యాణ్ సైన్ చేసే అవకాశం ఉండదని సినీ, రాజకీయ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపించాయి. ఇక.. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం నటించే సినిమాల్లో హరిహర వీరమల్లు పార్ట్ 1, ఓజి, ఉస్తాద్ భగత్ సింగ్ సిద్ధమవుతున్నాయి. ఇవి కాకుండా.. వీరమల్లు పార్ట్ 2 మాత్రం పవన్ నుంచి వస్తుందని.. తర్వాత జనసేన కోసం ఇండస్ట్రీకి పూర్తిగా గుడ్ బై చెప్పేస్తాడు అంటూ టాక్ నడిచింది. ఈ విషయంలో అభిమానులు సైతం నిరాశ వ్యక్తం చేశారు. అయితే.. ఇలాంటి క్రమంలో పవన్ కళ్యాణ్ ఓ క్రేజి డైరెక్టర్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట.
అసలు మ్యాటర్ ఏంటంటే.. గతంలో రామ్ తాళ్లురి ప్రొడ్యూసర్‌గా.. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో పవన్ కళ్యాణ్ ఓ స్క్రిప్ట్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తర్వాత ఆఫీస్‌లో పూజా కార్యక్రమాల ఫోటోలు కూడా అందరితో పంచుకున్నారు. తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ.. మెల్లమెల్లగా ఈ ప్రాజెక్టు సైడ్ ట్రాక్ పట్టింది. పవన్ ఎన్నికల్లో గెలవడం, డిప్యూటీ సీఎం గా బిజీ అయిపోవడంతో.. ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది అంటూ వార్తలు కూడా వైరల్ అయ్యాయి. కానీ.. తాజా అప్డేట్ ప్రకారం సురేందర్ రెడ్డి ఇటీవల పవన్ ను కలిసాడట. స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్న విషయాన్ని చెప్పి.. ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకువెళ్లే సాధ్య అసాధ్యాలను గురించి మాట్లాడినట్లు తెలుస్తుంది. అఫీషియల్ గా ఈ ప్రాజెక్టు పై అనౌన్స్మెంట్ రాకున్నా.. సినీ వర్గాల అంతర్గత సమాచారం ప్రకారం పవన్ ఈ సినిమాలో నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తుంది.
ఇదే వాస్తవమైతే సురేందర్ రెడ్డి నిజంగానే జాక్పాట్ కొట్టినట్టే. చివరిగా అఖిల్.. ఏజెంట్ సినిమాతో ఫ్లాప్ ఇచ్చిన సురేందర్ రెడ్డి పై.. కొంత ప్రతికూలత ఉన్నా.. ఒకప్పుడు కిక్, రేస్ గుర్రం, అతనొక్కడే లాంటి బ్లాక్ బస్టర్లు ఇచ్చిన నేపథ్యంలో.. సురేందర్ రెడ్డిని తక్కువ అంచనా వేయడం కూడా పొరపాటే. ఇక పవన్ ట్రాక్ రికార్డులు చూసి ఛాన్స్ ఇచ్చే టైప్ కానేకాదు. కథ నచ్చి, కంటెంట్ వర్క్ అవుట్ అవుతుంది అనిపిస్తే బ్లైండ్‌గా ఓకే చేసేస్తాడు. ఇక సురేంద్ర రెడ్డి ఎలా అయినా ఈ సారి హిట్ కొట్టాలని కసితో ఉన్నాడు. కచ్చితంగా దానికి తగ్గట్టు పవర్ ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేసి ఉంటాడు. ఈ క్రమంలో సినిమా నిజంగా ఓకే అయితే.. 2026 లో షూట్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఇక ఐదారు నెలల్లో ఈ షూట్ పూర్తి అవుతుందట. మరీ ఈ ప్రాజెక్ట్ ఏ రేంజ్‌లో వర్కౌట్ అవుతుందో చూడాలి.