కన్నప్ప త‌ప్పు, ఒప్పులివే.. అదొక్కటి లేదంటే మూవీ బ్లాక్ బస్టర్..!

మంచు విష్ణు ప్రధాన పాత్రలో.. ప్రభాస్, మోహన్ బాబు, మోహన్‌లాల్, అక్షయ్ కుమార్ కీలకపాత్రల‌లో నటించిన లేటెస్ట్ మూవీ కన్నప్ప. నేడు గ్రాండ్ లెవెల్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా ఆడియ‌న్స్‌లో పాజిటివ్ టాక్ దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాపై ఆడియన్స్‌లో భారీ హైప్‌ మొదలైంది. సినిమా చూసిన చాలామంది ఆడియన్స్.. సినిమాపై పాజిటివ్ గా మాట్లాడుతూ.. సినిమా బాగుందని అభిప్రాయాలు వ్యక్తం చేయడంతో సాధారణ ఆడియన్స్ సైతం థియేటర్లో సినిమా చూసేందుకు ఆరాటపడుతున్నారు. అయితే.. కన్నప్ప జీవిత కథ ఆధారంగా ఇప్పటికే ఎన్నో సినిమాలు తరికేక్కి మంచి రిజల్ట్ అందుకున్నాయి. ఇక ఏ సినిమా అయినా కచ్చితంగా ప్లస్లు, మైనస్లు ఉంటాయి. అలా.. తాజాగా రిలీజ్ అయిన కన్నప్ప సినిమాలోని ఉన్న ప్లస్, మైనస్‌లు ఏంటో ఒకసారి చూద్దాం.

కన్నప్పకు హైలెట్గా నిలిచిన అంశాల్లో మొదటిది స్టార్ కాస్టింగ్.. ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్, మోహన్ బాబులు.. ఈ సినిమాల్లో కీలకపాత్రలో నటించడం. సినిమాపై ఆడియన్స్ లో హైప్‌ క్రియేట్ అయ్యింది. ఇది సినిమాకు ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. కారణం.. ఇటీవల కాలంలో భక్తి భావంతో నిండిన మైథలాజికల్ సినిమాలు ఎక్కువగా సక్సెస్ అందుకుంటున్నాయి. ఇక.. ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్షన్ ఆకట్టుకుంది. సినిమా ఆఖరి 40 నిమిషాల క్లైమాక్స్ పూర్తి సినిమాకే వన్నె తెచ్చిందని అంటున్నారు. కన్నప్ప‌కు సంబంధించిన క్లైమాక్స్ అన్ని సినిమాల్లో ఒకేలా ఉన్నా.. మంచు విష్ణు కన్నప్ప మూవీ చూస్తున్నప్పుడు మాత్రం ఆడియన్స్‌కు గూస్ బంప్స్‌ ఖాయమని చెప్తున్నారు. అంతేకాదు.. విష్ణు తన నటనతో ఆడియన్స్‌ను ఆశ్చర్యపరిచాడు. రుద్ర పాత్రలో నటించిన ప్రభాస్ సినిమాకు మరో ప్లస్. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మరింత హైలెట్గా నిలిచింది.

ఇక కన్నప్ప వచ్చినప్పటి నుంచి వస్తున్న నెగటివ్ రోల్స్ సినిమాకు కాస్త మైనస్. అంతేకాదు.. సినిమా రిలీజ్ కు ముందే పలు వివాదాల్లో చిక్కుకొని హాట్‌ టాపిక్ గా మారింది. ఈ క్రమంలోనే సినిమాపై కాస్త నెగెటివిటీ కనిపించింది. ఇక సినిమా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ ఆఫ్ ఫిల్లింగ్ గా ఉందని.. బోర్ ఫీల్ వస్తుందంటూ సినిమా లెంత్ కాస్త తగ్గించి అవసరమైన సీన్స్ మాత్రమే స్పీడ్ ను పెంచి రూపొందిస్తే బాగుండేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఒక్క త‌ప్పు లేకుంటే సినిమా మ‌రింత స‌క్స‌స్ అందుకునేదని టాక్‌. ఇక విఎఫ్ఎక్స్‌లో నాణ్యత మిస్ అయిందని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక.. దాదాపు సినిమాలో చూపించిన అన్ని లొకేషన్లు ఆకట్టుకున్నా. కొన్ని సందర్భాల్లో మాత్రం లొకేషన్స్ సెట్ అవ్వలేదని అంటున్నారు.