స్పిరిట్ లో ప్రభాస్ క్యారెక్టర్ నేమ్ అదేనా.. నాగచైతన్య లైఫ్ లో మర్చిపోలేడుగా..?

ఇండస్ట్రీలో ఓ సినిమా రూపొందుతుంది అంటే.. కచ్చితంగా సినిమా టైటిలే కాదు.. హీరో, హీరోయిన్ల క్యారెక్టర్ పేర్లకు కూడా చాలా ఇంపార్టెన్స్ ఇస్తూ ఉంటుంది. డైరెక్టర్లు వాళ్ళు చూజ్‌ చేసుకునే పేర్లు కూడా.. సినిమాకు హైలెట్ అయ్యేలా ప్లాన్ చేస్తూ ఉంటారు అనడంలో అతిశయోక్తి లేదు. కాగా.. అలా ఇప్పటికే ఎంతోమంది.. సినీ ఇండస్ట్రీలో నటిస్తున్న హీరోలకు.. వాళ్ళ‌ సినిమాల్లో పెట్టుకున్న క్యారెక్టర్ల పేర్లను ముద్దు పేర్లుగా అభిమానులు పిలుచుకుంటున్న‌ సందర్భాలు చాలానే ఉన్నాయి. ఈ క్రమంలోనే.. తాజాగా స్పిరిట్ ప్ర‌భాస్ రోల్‌కు సంభందించిన ఓ న్యూస్‌ నెటింట హాట్ టాపిక్‌గా ట్రెండ్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ చూసినా ప్రభాస్ సినిమాకు సంబంధించిన న్యూస్‌లే వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.

గతంలో ఈ సినిమాలో దీపికా పదుకొనే హీరోయిన్గా నటించనుందంటూ టాక్ వినిపించినా.. రెమ్యునరేషన్ కారణంగా.. ఆమె ఆ సినిమా నుంచి తప్పుకుంది. ఈ క్రమంలో సందీప్ రెడ్డి వర్సెస్ దీపిక వార్ ఎలాంటిదో తెలిసింది. ఫైనల్లి ఆమె ప్లేస్ లో త్రిప్తి దిమ్రి నటించనుంది. సెకండ్ హీరోయిన్‌గా సెలెక్ట్ అయినట్లు సమాచారం. కాగా.. ఈ సినిమాలో ప్రభాస్ క్యారెక్టర్ పేరు ప్రస్తుతం హాట్ టాపిక్ గా మరింది. ప్రభాస్ ఈ మూవీలో పోలీస్ ఆఫీసర్గా కనిపించనున్న సంగతి తెలిసిందే. తన కెరీర్‌లోనే ఫస్ట్ టైం సినిమాల్లో పోలీస్ ఆఫీసర్గా నటించనున్నాడు. ఇక ఈ సినిమాల్లో.. ప్రభాస్ క్యారెక్టర్ పేరు కార్తీక్ నందన్ అని.. సందీప్ రెడ్డి వంగా రాసుకున్నాడట. స్పిరిట్ కోసం సందీప్ చాలా చాలా కష్టపడుతున్న సంగతి తెలిసిందే.

Ye Maaya Chesave

ఈ క్రమంలోనే ప్రాజెక్టును ఎప్పటికప్పుడు ఆడియన్స్ ఎంటర్టైన్ చేసేలా డిజైన్ చేసుకుంటున్నాడు. ఈ క్రమంలోనే కార్తీక్ అనే పేరుకు.. ప్రభాస్ పోలీస్ క్యారెక్టర్ లో పర్ఫామెన్స్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేలా డిజైన్ చేసుకుంటున్నాట్లు తెలుస్తుంది. కాగా ఈ న్యూస్ వైర‌ల్ కావ‌డంతో నాగచైతన్య ఏమాయ‌ చేసావే సినిమాను వైరల్ చేస్తున్నారు అభిమానులు. చైతు, సమంత కలిసి నటించిన ఏమాయ చేసావే సినిమా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమాల్లో చైతన్య క్యారెక్టర్ పేరు కార్తీక్ అన్న సంగతి తెలిసిందే. దీంతో ప్రభాస్ స్పిరిట్‌కు నాగచైతన్య సినిమాకు లింక్ చేసుకుంటూ రకరకాలుగా అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. నిజానికి.. సందీప్ రెడ్డి వంగ సినిమాలో హీరోయిన్గా సమంతని భావించాడట. కానీ.. ఆమె రిజెక్ట్ చేయడంతో ఈ సినిమాకు దీపికను భావించాడు. ఆమె కూడా ఈ సినిమా నుంచి తప్పుకుంది.