విజయ్ సేతుపతి కోసం రంగంలోకి గోల్డెన్ బ్యూటీ.. పూరికి ఈసారి హిట్ పక్కా..!

కోలీవుడ్ యాక్టర్ విజయ్ సేతుపతి హీరోగా.. పూరి జగన్నాథ్ డైరెక్షన్లో తాజాగా ఓ సినిమా ఫిక్స్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు చార్మి ఓ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరిస్తుంది. ఈ క్రమంలోనే గతంలో దీనిపై అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మేకర్స్. ఇందులో భాగంగానే.. విజయ్ సేతుపతి, చార్మి, పూరి జగన్నాథ్ కలిసి ఉన్న‌ ఓ ఫోటోను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. దీంతో ఆడియన్స్‌లో సినిమాపై మంచి హైప్‌ మొదలైంది. కాగా.. తాజాగా ఈ సినిమా కోసం మరో స్టార్ బ్యూటీ రంగంలోకి దిగిందంటూ న్యూస్ తెగ‌ వైరల్‌గా మారింది. ఇంతకీ ఆమె ఎవరో కాదు.. టాలీవుడ్ గోల్డెన్ బ్యూటీగా క్రేజీ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న సంయుక్త మీన‌న్‌.

ఈ అమ్మడు ఇప్పటివరకు టాలీవుడ్‌లో నటించిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ దగ్గర మంచి రిజల్ట్ అందుకుంది. ఈ క్రమంలోనే గోల్డెన్ బ్యూటీ ఇమేజ్‌తో దూసుకుపోతున్న సంయుక్త సైతం.. పూరీ సినిమాలో భాగమైందని మేకర్స్ అఫీషియల్ గా వెల్లడించారు. తమ ఎక్స్ వేదికగా టీం సంయుక్త తో పాటు చార్మి, పూరి కలిసి ఉన్న పిక్ పంచుకున్నారు. ఆమె నడకలో హుందాతనం.. కళ్ళలో ఆగ్రహం అంటూ సంయుక్తకు గ్రాండ్ వెల్కమ్ చెప్తూ దిగిన ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ గా మారుతుంది. ఇందులో ఆమె ఓ కీలక పాత్రలో మరువనుందట. ఈ క్రమంలోనే పూరితో సంయుక్త సినిమా సైతం బ్లాక్ బస్టర్ పక్క అంటూ ఫ్యాన్స్ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

Tabu Comes On Board For Vijay Sethupathi, Puri Jagannadh, Charmme Kaur, Puri  Connects' Most Ambitious Pan Indi a Project - Social News XYZ

ఇక ఇప్పటికే సినిమాలో సీనియర్ నటి ట‌బ్బు సెలెక్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు బెగ్గ‌ర్‌, భిక్షాందేహి అనే టైటిల్స్ ప‌రిశీలిస్తున్నార‌ట మేక‌ర్స్‌. అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన వచ్చేవరకు ఎదురుచూడాల్సిందే. కాగా పూరి జగన్నాథ్ గత కొంతకాలంగా సరైన హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆయన గత సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడిన సంగతి తెలిసిందే. దీంతో ఎలాగైనా హిట్ కొట్టాలని కాసితో ఉన్న పూరి.. విజయ్ సేతుపతిని తన కంటెంట్తో కన్విన్స్ చేశాడు. ఈ క్రమంలోనే వీళ్ళిద్దరి కాంబోలో ప్రాజెక్ట్ సెట్ అయింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన పనులు సర్వే గంగా జరుగుతున్నాయి. మ‌రీ సంయుక్త గోల్డెన్ సెంటిమెంట్ వ‌ర్కౌట్ అయ్యి ఈ సినిమాతో పూరీ హిట్ కొడ‌తాడో లేదో వేచి చూడాలి.