వార్ 2.. హృతిక్ పక్కన ఆ బుడ్డోడు అస‌లు సెట్ కాలేదు.. తారక్ రోల్‌పై ట్రోల్స్..!

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్.. బాలీవుడ్ కండల వీరుడు హృతిక్ రోషన్ కాంబోలో రూపొందిన బిగ్గెస్ట్ మల్టీ స్టార‌ర్ మూవీ వార్ 2. ఈ సినిమాతో ఎన్టీఆర్ బాలీవుడ్ ఎంట్రీ ఇవ‌నున్న‌ సంగతి తెలిసిందే. ఇక సినిమాలో హృతిక్ రోషన్‌తో తలపడే పవర్ ఫుల్ విలన్ గా ఎన్టీఆర్ మెరువనున్నారు. అయాన్‌ ముఖర్జీ డైరెక్షన్‌లో య‌ష్ రాజ్ ఫిలిమ్స్ బ్యానర్ పై ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమాపై ఇప్పటికే అభిమానుల్లో భారీ అంచనాల నెలకొన్నాయి. ముఖ్యంగా ఒకే సినిమాలో ఇద్దరు టాప్ స్టార్ హీరోలు తలపడడం.. అటు బాలీవుడ్‌తో పాటు.. ఇటు సౌత్ ఇండస్ట్రీలోనూ ఎంతో ఆసక్తి నెల‌కొల్పింది. ఇలాంటి క్రమంలో.. తారక్ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటూ తాజాగా వార్ 2 ట్రైలర్ రిలీజ్ చేశారు టీం.

అయితే ఈ ట్రైలర్ రిలీజ్‌లో ఎన్టీఆర్‌కు సంబంధించిన కటౌట్‌, న‌ట‌న‌పై చాలా వరకు ప్రశంసలు దక్కినా.. కొంతమంది మాత్రం హృతిక్ రోషన్ పక్కన తారక్ కటౌట్ అసలు వర్కౌట్ కాలేదని.. ఆ పొట్టోడు హృతిక్ పక్కన అస్సలు సెట్ కాలేదంటూ ట్రోల్స్ చేస్తూ నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్లో ఓ వర్గం ప్రజలు ఎన్టీఆర్ను టార్గెట్ చేసి పగబట్టినట్లుగా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. హృతిక్‌ లాంటి బాడీ, కటౌట్‌ ఉన్న హీరోతో వార్ చేయాలంటే ఆయనకు సరిపోయే రేంజ్ హీరో ఉండాలి.. అసలు ఎన్టీఆర్ కటౌట్ కి.. హృతిక్ క‌టౌట్‌కి సంబంధమే ఉండదు. సౌత్ ఇండస్ట్రీలో ప్రభాస్.. లేదా రానా లాంటి స్టార్ హీరోలు అయితే హృతిక్ రోషన్ కి విల‌న్‌లుగా పర్ఫెక్ట్ గా సెట్ అయ్యేవారు.. అలాంటి వాళ్ళందరినీ వదిలేసి హృతిక్ పక్కన ఎన్టీఆర్ ను తీసుకోవడం ఏంటి అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

War 2' Teaser: Hrithik Roshan's Elite RAW Agent Faces Off Against a  Ruthless Jr NTR in This Action-Packed YRF Spy Universe Film (Watch Video) |  🎥 LatestLY

హృతిక్ పక్కన సమానంగా కనిపించాలని తారక్ స్టూల్ వాడాడు.. ఆ ప్లేస్ లో ఐస్ ఉన్నట్లు ఎడిట్ చేసేసి కవర్ చేసేసారు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎన్టీఆర్, హృతిక్ పర్సనాలిటీకి విలన్ గా అస్సలు సెట్ కాలేదు.. ఆయనకు హృతిక్ రోషన్ ముందు కట్ కటౌట్ కుదరలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే ఎన్టీఆర్ పై వస్తున్న ట్రోల్స్ అన్నింటిని తారక్‌ అభిమానులు సైతం స్ట్రాంగ్ గా తిప్పి కొడుతున్నారు. హైట్, పర్సనాలిటీ కాదు వాటిని ఎలాగైనా మేనేజ్ చేయొచ్చు.. అసలు చూడవలసింది యాక్టింగ్. నటనలో నందమూరి బిడ్డను టచ్ చేసే వాడే లేడు అంటూ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమా ఆగష్ట్‌ 14న గ్రాండ్ లెవెల్లో రిలీజ్ కానుంది. రిలీజ్ తర్వాత సినిమా ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో వేచి చూడాలి.