టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బర్త్‌డే సెలబ్రేషన్స్ లో భాగంగా నిన్న వార్ 2 సినిమా టీజర్ ను గ్రాండ్ లెవెల్ లో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సినిమాలో పర్ఫామెన్స్ ప్రేక్షకులను ఆకట్టుకున్న.. విఎఫ్ఎక్స్ షాట్స్ విషయంలో మాత్రం ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైతం అసంతృప్తి వ్యక్తం చేశారు. మూవీ లవర్స్ విఎఫ్ఎక్స్ ఈకట్టుకోలేకపోయాయి.. సినిమాల అన్నింటికీ ఒకే తరహా కథను వాడేస్తున్నారు అంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. ఎన్టీఆర్ ను నెగటివ్ రోల్ లో చూపించడం చాలామందికి నచ్చడం లేదు. ఈ క్రమంలోనే ఎన్టీఆర్ వార్ 2 విషయంలో రాంగ్ స్టెప్ తీసుకున్నడంటూ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు.
బాలీవుడ్లో కూడా.. ఈ టీజర్ పై ఎన్నో ట్రోల్స్ మొదలయ్యాయి. ఈ క్రమంలోనే యూట్యూబ్‌లో 24 గంటలు గడిచిన తర్వాత టీజర్‌కు వచ్చిన ఫ్యూస్ లైక్స్ చూసి అభిమానులకు షాక్ తగిలినట్టు అయింది. 24 గంటల్లో తెలుగు వర్షన్ టీజర్ కి కేవలం 3.15 మిలియన్ వ్యూస్, 2 లక్షల 18 వేల లైక్స్ వచ్చాయి. ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఇది చాలా అంటే చాలా పూర్ రెస్పాన్స్ అని చెప్పవచ్చు. హిందీ వర్షన్ లో మాత్రమే టీజర్ కు 24 గంటల్లో ఏకంగా 20 మిలియన్ వ్యూస్ పైగా రాగా.. 60 లక్షల 79 వేల లైక్స్ సాధించింది. దీన్నిబట్టి సినిమాకు టాలీవుడ్ లో కంటే హిందీలోనే మరింత క్రేజ్ ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ ఫ్యాన్స్ సైత్ ఈ సినిమాలో సీరియస్‌గా తీసుకోలేదు అన్న టాక్ నడుస్తుంది. ఇంతకుముందు టీజర్ విషయంలో ఎన్టీఆర్‌కు ఒక ట్రాక్ రికార్డు ఉండేది. అత్యధిక లైక్స్, అత్యధిక వ్యూస్ దక్కించుకున్న రికార్డ్స్ అన్ని ఎన్టీఆర్ ఖాతాలోనే ఉండేవి.
అలాంటి స్టార్ సినిమాకు ఇంత తక్కువ రెస్పాన్స్ రావడం అసలు సహించలేకపోతున్నారు తారక్ ఫ్యాన్స్. ఎన్టీఆర్ పుట్టినరోజున సరైన బహుమతి రాలేదని అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ మరింత డిసప్పాయింటింగ్ మ్యాటర్ ఏంటంటే.. కన్నప్ప టీజర్ కు 24 గంటల్లో వచ్చిన వ్యూస్ ను కూడా టచ్ చేయలేక పోయిందట వార్ 2. కన్నప్ప టీజర్ 24 గంటల్లో 4.94 మిలియన్ వ్యూస్ సాధించగా.. 1,83 వేల లైక్స్ దక్కాయి. అయితే వార్ 2 తెలుగు టీజర్ ఎలాంటి యాడ్స్ లోను కనిపించలేదు. వేసి ఉండుంటే కచ్చితంగా ట్రాక్ రికార్డ్ బద్దలయ్యేది.. యాడ్స్ వేయకపోవడం వల్ల పెద్ద రేంజ్‌కు రీచ్ కాలేదని ఎన్టీఆర్ ఫ్యాన్స్ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమాలో కేవలం రెండు పాటలు మాత్రమే ఉంటాయట. అవి త్వరలోనే రిలీజ్ చేయనున్నారని.. వాటికి బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ ఖాయమని సమాచారం.