కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్‌గా ఎప్పటినుంచో ఇండస్ట్రీలో కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా పెళ్లికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విశాల్.. హీరోయిన్ సాయి ధన్సికతో ఏడు అడుగులు వేసేందుకు సిద్ధమవుతున్నాడు. వీళ్ళ పెళ్లి 2025 ఆగస్టు 29న జరగనున్నట్లు అఫీషియల్‌గా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లు సైలెంట్ రిలేషన్‌షిప్‌ను మెయింటైన్ చేసిన ఈ జంట ఇప్పుడు పెళ్లి వైపు పరుగులు తీస్తున్నారు. ఈ క్రమంలోనే వీరి రిలేషన్‌ను యోగిత మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో అఫీషియల్ గా ప్రకటించారు. కాగా.. విశాల్, ధన్సిక మధ్యన 15 ఏళ్ల నుంచి పరిచయం ఉందని ఇంతకుముందు వారి మధ్య కేవలం ప్రొఫెషనల్ ఫ్రెండ్లీ రిలేషన్ షిప్ మాత్రమే ఉండేదంటూ టాక్ నడుస్తుంది. అయితే.. ఇటీవల వీళ్లిద్దరూ కలిసి ఎక్కువ సమయం గడుపుతున్న నేపథ్యంలో.. ఈ రిలేషన్ కాస్త ప్రేమగా మారింది అని చెప్పుకొచ్చింది.
ధన్సిక తన లైఫ్ లో ఒక కష్టకాలంలో విశాల్ అండగా నిలిచాడని ఎంతో సపోర్ట్ చేశాడని.. ఈ క్రమంలోనే మా మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ కాస్త ప్రేమగా మారింది అంటూ ధన్సిక చెప్పుకొచ్చింది. ఇక మేము రిలేషన్‌షిప్‌ను పబ్లిక్ చేయాలని ఎప్పుడూ భావించలేదు. కానీ.. అదే రోజున ఓ న్యూస్ రిపోర్ట్ నెటింట తెగ వైరల్‌గా మారింది. ఈ రిలేషన్‌ను రివిల్ చేయడానికి సరైన సమయం ఇదే అనిపించింది. అందుకే రివీల్ చేసాం అంటూ వివరించింది. ఇక అమ్మడు 2006లో మనతోడు మలైకాలం సినిమాతో ఇండస్ట్రీలోకి పరిచయమయ్యింది. తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కబాలి సినిమాలోను నటించి మంచి పాపులారిటి దక్కించుకుంది. తెలుగులో షికారు అంతిమ తీర్పు దక్షిణా లాంటి సినిమాలతో మెప్పించింది. ఇలాంటి క్రమంలోనే ధన్సిక విషయాలు మధ్యన ఏజ్ గ్యాప్.. నెట్టింట వైరల్‌గా మారుతుంది.
ప్రస్తుతం ధన్సిక ఏజ్ 35 ఏళ్లు కాగా.. విశాల్ వయసు 47 సంవత్సరాలు. అంటే.. ఈ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఏకంగా 12 ఏళ్లు ఉంది. ఈ క్రమంలోనే విశాల్, ధన్సికలపై ట్రోల్స్ మొదలుపెట్టారు. ఏకంగా ఇంత చిన్న పిలల్లను ఎలా వివాహం చేసుకుంటున్నాడు అంటూ ధన్సిక అయిన అంత ఏజ్ గ్యాప్ ఉన్న వ్యక్తిని ఎలా ప్రేమించింది.. పెళ్లికి ఎలా రెడీ అవుతుంది అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా.. విశాల్ మాట్లాడుతూ.. ధన్సిక చాలా మంచి వ్యక్తి .. తనలాంటి వ్యక్తి నా లైఫ్‌లోకి రావడం నా అదృష్టం. మేమిద్దరం కలిసి కొత్త ప్రయాణాన్ని మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం అంటూ వివరించాడు. ఇది ప్రేమ వివాహమేనని.. పెళ్లి తర్వాత కూడా ధన్సిక సినిమాల్లో నటిస్తుందని సినిమాల పట్ల ఆమెకున్న ప్యాషన్‌ను గౌరవిస్తా అంటూ చెప్పుకొచ్చాడు.