టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ సినిమాతో బ్లాక్ బస్టర్ తర్వాత.. నటించిన మూవీ దేవర. భారీ అంచనాల నడుమ రిలీజ్ అయిన ఈ సినిమా ఆడియన్స్‌లో మొదట మిక్స్డ్ టాక్ తెచ్చుకున్నా.. మెల్లమెల్లగా పాజిటివ్ టాక్ దక్కించుకుని బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకకుంది. ఇక ఎన్టీఆర్ స్క్రీన్ ప్రజెన్స్, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ సినిమాలో ఎన్టీఆర్.. దేవర, వర (తండ్రి, కొడుకు)లుగా డ్యూయల్ రోల్ లో నటించిన సంగతి తెలిసిందే.
జాన్వి కపూర్ హీరోయిన్గా, సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో మెరిసిన ఈ సినిమా ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంది. అయితే.. ఈ సినిమాకు రెండో భాగం కూడా ఉందని మేకర్స్ మొదట్లోనే అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. కాగా.. తాజాగా జపాన్లో దేవర పార్ట్ వన్ రిలీజ్ చేసి అక్కడ మంచి రెస్పాన్స్ని దక్కించుకున్నారు టీం. ఎన్టీఆర్‌కు టెంపర్ నుంచే అక్కడ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ నెలకొంది. ఈ క్రమంలోనే జపాన్‌లో దేవరకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
కాగా అక్కడ దేవర కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న నేపథ్యంలో.. ఎన్టీఆర్ జపాన్ మీడియాతో ముచ్చటించాడు. ఇందులో భాగంగానే దేవర పార్ట్ 2 పై పిక్స్ లెవెల్లో హైప్‌ను పెంచేలా కామెంట్ చేశాడు ఎన్టీఆర్. దేవర పార్ట్ వన్ లో మీరు చూసింది కొంతే.. ఇంకా చూడాల్సింది చాలా ఉంది. పార్ట్ 1లో దేవర గురించి మాత్రమే మీరు తెలుసుకున్నారు. వరా ఎలాంటోడో తెలుసుకోవాలంటే పార్ట్ 2 చూడాల్సిందే. పార్ట్ 2 వేరే లెవెల్‌లో ఉంటుందంటూ కామెంట్స్ చేశాడు. ఎన్టీఆర్ కామెంట్స్ ప్రస్తుతం తెగ వైరల్ గా మారడంతో.. ఫ్యాన్స్ లో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.