టాలీవుడ్ ఇండస్ట్రీ దిగ్గజ నటులుగా తిరుగులేని ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కు ఎలాంటి బాండింగ్ ఉండేదో అందరికీ తెలిసిందే. అయితే వీళ్ళ వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన బాలయ్య, నాగార్జున కూడా మొదట్లో అంతే ఫ్రెండ్లీగా ఉండేవారు. కానీ క్రమక్రమంగా వీరిద్దరి మధ్యన విభేధాలు మొదలై.. అది కాస్త బద్ధ శత్రుత్వంగా మారింది. ఇక ఈ ఇద్దరు స్టార్ హీరోస్ ఒకే ఈవెంట్ లో ఒకే దగ్గర కూర్చున్న కూడా.. కనీసం పలకరించుకోరు సరి కదా.. ఒకరి ముఖం ఒక్కరు కూడా చూసుకోరు. అంతలా వీరిద్దరి మధ్యన వైరం ముదిరిపోయింది.
అయితే గతంలో వీరిద్దరి స్నేహంగా ఉన్న క్రమంలో.. వీళ్ళిద్దరూ కలిసి ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలనుకున్నారట. అదే బాలీవుడ్ బ్లాక్ బస్టర్ చుప్కే చుప్కే. ఈ సినిమాను బాలయ్య, నాగార్జున కలిసి నటించాలని భావించారు. కానీ.. ఈ సినిమా తెలుగులో రాకపోవడానికి కారణం తారక్ అని.. స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. నాగ్, బాలయ్య కలిసి సినిమా చేద్దాం అనుకునే టైంలో.. తారక్, చైతూతో కలిసి గుండమ్మ కథ సినిమాను రీమేక్ చేయాలనుకుంటున్నా అని.. మీ కాంబో వస్తే మా కాంబో సెట్ కాదని నాగార్జునతో వివరించాడట.
దీంతో బాలయ్య, నాగార్జున కలిసి చేయాల్సిన మల్టీ స్టారర్ సినిమా సెట్స్ పైకి రాకముందే అటకెక్కింది. ఈ విషయాన్ని స్వయంగా నాగార్జున ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. అంతేకాదు.. బాలయ్యతో సినిమాలో నటించాలని కోరిక నాకు కూడా ఉందని కానీ.. అన్నీ మనం అనుకున్నట్లుగా కలిసి రావు కదా అంటూ నాగార్జున కామెంట్స్ చేశారు. తర్వాత వీళ్ళిద్దరి మధ్యన వార్ కారణంగా మళ్లీ వీళ్ళు ఎక్కడ కలవలేదు. అలా బాలయ్య, నాగార్జున నటించాల్సిన సినిమా జూనియర్ ఎన్టీఆర్ కారణంగా ఆగిపోయింది.