చరణ్ హీరోగా పనికొస్తాడని చిరు నమ్మింది అప్పుడే.. రజినీకాంత్ ఫస్ట్ రియాక్షన్..!

సినీ ఇండస్ట్రీలో మెగాస్టార్ న‌ట‌వార‌సుడిగా అడుగుపెట్టి.. గ్లోబల్ స్టార్ ఇమేజ్‌తో దూసుకుపోతున్నాడు రామ్ చరణ్. ఎంత చిరంజీవి కొడుకు అయినా సరే.. ప్రేక్షకుల ఆదరణ పొందకపోతే.. టాలెంట్ తో ఆడియన్స్ మెప్పించ లేకపోతే ఇండస్ట్రీలో కొనసాగడం కష్టం. అలాంటిది.. ప్రస్తుతం గ్లోబల్ స్టార్ రేంజ్ లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తో రాణిస్తున్నాడు. అయితే మొదట చిరంజీవికి.. చరణ్ హీరో చేయాలని ఆలోచన లేదట. కానీ.. తర్వాత జరిగిన ఒక ఇన్సిడెంట్ తో చరణ్ హీరోగా పనికొస్తాడని చిరంజీవి పూర్తిగా నమ్మాడట. ఈ విషయాన్ని చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు.

Chirutha (2007) - IMDb

ఇంట్లో జరిగే చిన్న చిన్న పార్టీలు, ఈవెంట్లలో బన్నీ, చరణ్, శిరీష్ వీళ్లంతా డ్యాన్సులు వేస్తూ ఎంజాయ్ చేసే వాళ్ళు. అదంతా సరదాగా అని నేను అనుకున్నా. చరణ్ హీరో అవుతాడు అన్న ఆలోచన నాకు లేదు. అయితే నా పెద్ద కూతురు సుస్మిత పెళ్లి సంగీత్‌ వేడుకల్లో టాలీవుడ్ నుంచి ఎంతమంది సెలబ్రిటీస్ వచ్చారు. వారితో కలిసి ఏమాత్రం భయం లేకుండా పర్ఫెక్ట్ టైమింగ్‌తో డ్యాన్స్ వేయడం నాకు ఆశ్చర్యాన్ని కల్పించింది. చరణ్‌లో కాన్ఫిడెన్స్‌ని నేను అప్పుడే గమనించా. హీరోగా పనికి వస్తాడని ఆ టైంలో నేను ఫిక్స్ అయ్యా అంటూ చిరంజీవి వివరించాడు.

తర్వాత కొంతకాలానికి పూరి జగన్నా డైరెక్షన్లో చరణ్ హీరోగా చిరుత సినిమాతో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. చరణ్ డ్యాన్స్ ,ఫైట్స్ ఆడియన్స్‌ను ఆకట్టుకున్నాయి. మొదటి సినిమాతో చరణ్ పాస్ మార్కులు కొట్టేశాడు. ఇక మిగిలినవన్నీ నెక్స్ట్ సినిమాల్లో చూడొచ్చని చిరంజీవి భావించాడట. అయితే చిరుత‌ సినిమా.. చరణ్ పర్ఫామెన్స్ కి ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీస్ అంతా ప్రశంసలు కురిపించినట్లు చిరంజీవి వెల్లడించారు. రజినీకాంత్.. చిరుత చూసి నీ కొడుకు పాస్ మార్క్ తెచ్చుకోవడం కాదు.. డిస్టెన్స్ లో పాస్ అయిపోయాడు అని కామెంట్లు చేశారట.

Chiranjeevi and rajinikanth sales

నాగార్జున కూడా అదే మాట అన్నారని.. షూటింగ్ జరుగుతున్నని రోజులు చాలా మంది చరణ్‌ని టెన్షన్ పెట్టేవారు అంటూ చెప్పుకొచ్చాడు చిరంజీవి. మీ నాన్నగారి పేరు నిలబెట్టాలి జాగ్రత్తగా చేయనేవాళ్ళ‌ట‌. చరణ్ కు పదే పదే చెబుతూ ఉండేవారట‌. అంత స్ట్రెస్ లో కూడా చరణ్ చిరుతలో తన పర్ఫామెన్స్ తో ఆడియన్స్ను ఆకట్టుకున్నాడు. ఆ తర్వాత మగధీర, రంగస్థలం సినిమాలో చరణ్ త‌న మార్క్ నటనతో స‌త్తా చాటుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్ చరణ్ కు పాన్ ఇండియా లెవెల్లో ఇమేజ్ సొంతమైంది. ఇక ప్రస్తుతం చరణ్‌.. బుచ్చిబాబు సన్న డైరెక్షన్లో పెద్ది సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి.