సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్లుగా మారి వరస సినిమా ఆఫర్లను అందుకున్న ముద్దుగుమ్మల్లో శ్రీ లీల మొదటి వరుసలో ఉంటుంది. ఒకప్పటి స్టార్ హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్.. హీరోగా నటించిన పెళ్లి సందడి సినిమాతో శ్రీ లీల హీరోయిన్గా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఊహించిన రేంజ్లో సక్సస్ అందుకోకపోయినా అమ్మడి నటన, డ్యాన్స్, అందం ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలోనే మంచి పాపులారిటి దక్కించుకున్న శ్రీ లీల.. తర్వాత రవితేజ ధమాకా సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఇక సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో వరుస పెట్టి అవకాశాలు క్యూ కట్టాయి.
ఇప్పటివరకు ఈమె తెలుగులో ఎన్నో సినిమాల్లో నటించి ఆకట్టుకుంది. అయితే.. సరైన సక్సెస్ మాత్రం దక్కలేదు. కాగా..కెరీర్ ప్రారంభించిన కొత్తలోనే స్పెషల్ సాంగ్ లో సైతం నటించింది. అదే పుష్ప 2. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ డైరెక్షన్‌లో.. బన్నీ హీరోగా.. రష్మిక మందన హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ సినిమాకి హైలెట్. ఈ క్రమంలోనే శ్రీలీల దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కాగా శ్రీలీల.. టాలీవుడ్ సీనియర్ హీరోయిన్లను ఫాలో అవుతుందంటూ ఓ న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారుతుంది. దానికి కారణం ఏంటో.. అసలు మేటర్ ఏంటో ఒకసారి తెలుసుకుందాం.
టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా రాణించిన అనుష్క, కాజల్, సమంతలు కూడా కెరీర్ పిక్స్‌లో ఉన్న సమయంలో స్పెషల్ సాంగ్స్‌లో నటించి ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే.. ఈ ముగ్గురు ముద్దుగుమ్మలు కూడా కేవలం ఒకే ఒక్క సినిమాలో స్పెషల్ సాంగ్ తో ఆకట్టుకున్నారు. శ్రీ లీల కూడా ఇప్పటివరకు తన సినీ కెరీర్‌లో కేవలం పుష్ప 2 సినిమాలో మాత్రమే స్పెషల్ సాంగ్‌తో మెరిసింది. ఈ క్రమంలోనే ఈ ముగ్గురు సీనియర్ స్టార్ హీరోయిన్ల బాటలోనే.. శ్రీలీల కూడా పయనిస్తుందని.. ఇకపై ఆమె కూడా మరే స్పెషల్ సాంగ్ లో నటించదంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి ముందు.. ముందు.. శ్రీ లీలా ఎలాంటి డెసిషన్ తీసుకుంటుందో.. మరిన్ని స్పెషల్ సాంగ్స్ లో నటిస్తుందో.. లేదో.. వేచి చూడాలి.